తిరుమల లడ్డూపై(Tirumala Laddu) ప్రపంచవ్యాప్తంగా దుమారం రేగుతున్న సమయంలో చాలా మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు

తిరుమల లడ్డూపై(Tirumala Laddu) ప్రపంచవ్యాప్తంగా దుమారం రేగుతున్న సమయంలో చాలా మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. అయితే నిన్నమొన్నటి వరకు టీటీడీలో(TTD) కీలకంగా వ్యవహరించిన మాజీ ఈవో ధర్మారెడ్డి మాత్రం నోరు విప్పడం లేదు. ధర్మారెడ్డి(Dharma reddy) వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఉన్నప్పుడే తిరుమలలో జరిగే కార్యక్రమాలతో వైసీపీ ప్రభుత్వంపై అపవాదులు వచ్చాయి. కానీ లడ్డూ వివాదంపై ఇంత రచ్చ జ‌రుగుతున్నా ఆయ‌న మాత్రం త‌న‌కేమీ సంబంధం లేద‌న్న‌ట్టు వ్యవహరిస్తున్నారు. ధర్మారెడ్డి వ్యవహారంపై హైద‌రాబాద్‌లో సేద‌దీరుతున్నార‌ని వైసీపీ నేత‌లు(YCP Leaders) కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ హయాంలో తిరుమ‌ల‌లో ఇష్ట‌మొచ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రించిన ధ‌ర్మారెడ్డి, ఇలాంటి క్లిష పరిస్థితుల్లో వైసీపీ త‌ర‌పున మాట్లాడ‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. తిరుమ‌ల ప్ర‌సాదంపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే విమర్శలు చేస్తే.. ధర్మారెడ్డి ఎందుకు స్పందించడం లేదంటున్నారు. గత ఐదేళ్లుగా తిరుమలను అపవిత్రం చేశారని.. తిరుమల పవిత్రను దెబ్బతీసేలా వ్యవహరించారని, ప్ర‌సాదానికి వచ్చే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని చంద్ర‌బాబు, మంత్రులు, కూట‌మి నేత‌లు మండిపడుతున్నారు. అప్పట్లో టీటీడీలో ఉన్న‌తాధికారిగా విధులు నిర్వ‌ర్తించిన ధ‌ర్మారెడ్డి స్పందించ‌క‌పోవ‌డం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ధర్మారెడ్డి నోరు విప్పితే నిజానిజాలు బయట పడతాయని వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ధర్మారెడ్డి కూడా తనకు ఎందుకొచ్చిందని.. గాలికి పోయే కంపను తనకు ఎందుకు తాకించుకోవలన్న వైఖరితో ఉన్నారని తెలుస్తోంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story