Wife Kills Husband: ప్రియుడిపై మోజుతో సుపారీ ఇచ్చి భర్తను చంపించిన భార్య..!
వివాహేతర సంబంధానికి అడ్డుపడ్డ భర్తను కిరాతకంగా చంపిన భార్య

ప్రియుడిపై మోజుతో తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారీ ఇచ్చి మరీ భర్తను అంతమొందించింది ఓ మహిళ. విశాఖపట్నం జిల్లాలోని మధురవాడలో ఈ ఘటన జరిగిఒంది. బక్కనపాలెం ఎన్టీఆర్ కాలనీకి చెందిన అల్లాడ నాగరాజు(38), రమ్య దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కంచరపాలేనికి చెందిన సంజీవి వసంతరావుతో రమ్య వివాహేతర సంబంధం పెట్టుకుంది.
తమ అక్రమ బంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంగా ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి హత్యకు స్కెచ్ గీసింది. నాగరాజును చంపేందుకు వీరిద్దరూ కంచరపాలేనికి చెందిన బాలకృష్ణ, ప్రవీణ్‌కు రూ.50 వేలు ఇచ్చారు. నిందితులు వసంతరావు, బాలకృష్ణ, ప్రవీణ్ పథకం ప్రకారం నవంబరు 29న మధురవాడ మిథిలాపురి వుడా కాలనీలో గల ఓ లాడ్జిలో నాగరాజును హత్య చేసి శవాన్ని తిమ్మాపురం వెళ్లే రోడ్డులో ఉన్న బావికొండ సమీప నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. అనంతరం ఏమీ తెలియనట్లు రమ్య తన భర్త కనిపించడం లేదంటూ డిసెంబర్ 17న పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది.
మిస్సింగ్ కేసు నమోదు చేయాలని, తన భర్త మద్యానికి బానిసయ్యాడని, రూ.5 వేలు నగదు, బంగారం పట్టుకుని వారం రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొంది. అనుమానం వచి్చన పోలీసులు రమ్యను తమదైన శైలిలో విచారించగా, హత్య ఉదంతం బయటపడింది. పథకం ప్రకారం తామే హత్య చేసినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులు బుధవారం మృతదేహం పడేసిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. బాగా పాడైపోయిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. కేసు నమోదు చేసి, నిందితులు నలుగురినీ అరెస్టు చేసినట్లు పీఎంపాలెం సీఐ బాలకృష్ణ చెప్పారు.


