Prakasham : భర్త మర్మాంగంపై మసిలే నీటిని పోసింది...
భర్త ఆదమరచి నిద్రపోతున్నాడు. భర్త మీద తీవ్ర కోపంతో ఉన్న భార్య సలసలమని కాగుతున్న నీటిని(Boiling water) అతడి పురుషాంగం(penis) మీద పోసింది. ప్రస్తుతం అతడు ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా(Prakasham) వినుకొండ పట్టణం హనుమాన్‌నగర్‌లో జరిగింది.
భర్త ఆదమరచి నిద్రపోతున్నాడు. భర్త మీద తీవ్ర కోపంతో ఉన్న భార్య సలసలమని కాగుతున్న నీటిని(Boiling water) అతడి పురుషాంగం(penis) మీద పోసింది. ప్రస్తుతం అతడు ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా(Prakasham) వినుకొండ పట్టణం హనుమాన్‌నగర్‌లో జరిగింది. ఎర్రగొండపాలెం గ్రామానికి చెందిన నాయిని ప్రభుదాసు, అనూష దంపతులు కొన్ని రోజుల నుంచి హనుమాన్‌నగర్(Hanuman Nagar) 13వ లైన్‌లో నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాలతో కొన్ని నెలలుగా భార్యభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. నాలుగు నెలల కిందట పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. భార్యాభర్తలకు పెద్ద మనుషులు సర్ది చెప్పారు. అనూష తల్లిదండ్రులు సుబ్బారావు, అకమ్మ కూడా బిడ్డకు సుద్దులు చెప్పి కాపురానికి పంపించారు. వినుకొండలో నెలవారి వాయిదాల పద్దతిలో వ్యాపారం చేసుకుంటున్న ప్రభుదాసు భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. కాపురానికైతే వచ్చింది కానీ భర్తతో కలిసి ఉండటం అనూషకు ఇష్టంలేదు. నిద్రపోతున్న భర్త మర్మాంగంపై కాగే నీటిని పోసింది. అనూష కుటుంబసభ్యులు తనను చంపడానికి ప్రయత్నించారని బాధితుడు అంటున్నాడు. హత్యాయత్నానికి పాల్పడిన అనూషను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.