తన బావతో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ మహిళపై కొడవలితో దాడి చేసిన నెల్లూరు రూరల్‌ పరిధిలో చోటుచేసుకుంది.

తన బావతో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ మహిళపై కొడవలితో దాడి చేసిన నెల్లూరు రూరల్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తోటపల్లిగూడూరు (thotapalli guduru)మండలానికి చెందిన మహిళ శేషమ్మ(Sheshamma)ను 20 ఏళ్ల క్రితమే భర్తను వదిలేశాడు. ధనలక్ష్మీపురం(Dhanalaxmi puram)లో ఉంటూ పండ్ల వ్యాపారం చేసుకుంటోంది. ఈ క్రమంలో తోటపల్లిగూడురుకు చెందిన మరో వ్యక్తి కరుణాకరన్‌(Karunkaran)తో ఆమె రిలేషన్‌షిప్‌లో ఉంది. శేషమ్మతోనే అధిక సమయం గడిపేవాడు. అతను ఇంటికి వెళ్లకుండా ఎక్కువ సమయం శేషమ్మ వద్ద ఉండటం అతడి బావమరిది శ్రీనివాసులు(Srinivasulu)కు తెలిసింది. తన సోదరికి అన్యాయం జరుగుతోందని శేషమ్మపై కోపం పెంచుకున్నాడు. శుక్రవారం పండ్ల దుకాణం వద్ద శ్రీనివాసులు కొడవలితో శేషమ్మ మెడపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story