అత్తలేని కోడలుత్తమురాలు ఓయమ్మ.. కోడలు లేని అత్త గుణవంతురాలు.. అనే పాట వినే ఉంటారు.

అత్తలేని కోడలుత్తమురాలు ఓయమ్మ.. కోడలు లేని అత్త గుణవంతురాలు.. అనే పాట వినే ఉంటారు. ఫ్యామిలీ గొడవల(Family issues) కారణంగా అత్త(Mother in law) మీద ఓ కోడలికి(Daughter in law) చెడ్డ కోపం వచ్చేసింది. ఆ కోపంతో అత్త చెవిని(Ear) గట్టిగా కొరికేసింది. ఎంత గట్టిగా అంటే చెవి ఊడిపోయేలా! గుంటూరు(Guntur) జిల్లా తుళ్లూరులో ఈ ఘటన జరిగింది. కంభంపాటి శేషగిరి, పావని(30) దంపతులకు ఇద్దరు కొడుకులు. కొంతకాలంగా పావనికి అత్త నాగమణి (55)కి మధ్య అసలు పడటం లేదు. ఆదివారం రాత్రి పెద్ద గొడవ జరిగింది. అప్పుడు కోడలు అత్త చెవిని కొరికేసింది. చెవి ఊడిపోయింది. తెగి పడిన చెవిని, నాగమణిని తుళ్లూరు పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. తదనంతరం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆలస్యం కావడంతో తెగిన చెవిని అతకడం కష్టమని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు కోడలిపై అత్త కంప్లయింట్ చేస్తుందా? లేక కొడుకు భార్యేనని సర్దుకుపోతుందా? అన్నది చూడాలి.

Updated On
Eha Tv

Eha Tv

Next Story