Woman Constable : వివాహితుడి ప్రేమలో పడిన మహిళా పోలీస్..!
చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన ఒక మహిళా కానిస్టేబుల్ తన ప్రియుడికి పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారని తెలుసుకొని అతని ఇంటి ఎదుటే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది.

చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన ఒక మహిళా కానిస్టేబుల్ తన ప్రియుడికి పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారని తెలుసుకొని అతని ఇంటి ఎదుటే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఓ ఫైనాన్స్‌లో కలెక్షన్‌మెన్‌గా ఉన్న వాసుకు ప్రశాంతితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. అతనికి పెళ్లయి ఇద్దరు పిల్లలున్న విషయాన్ని ఆమెతో చెప్పకుండా ప్రేమ వ్యవహారం నడిపాడు. వాసు పనిచేస్తున్న ఫైనాన్స్‌లో గొడవలు రావడంతో అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. దీంతో ఆరు నెలల క్రితం ప్రొద్దుటూరు వదిలి వాసు స్వగ్రామానికి వచ్చేశాడు. అప్పటి నుంచి ప్రశాంతితో మాట్లాడడం తగ్గించేశాడు. అతనిపై అనుమానంతో గురువారం ఆమె మార్వాడ గ్రామానికి వచ్చి విచారించడంతో అసలు విషయం బయటపడింది. అప్పటికే భార్యాబిడ్డలతో కలిసి ఉన్న వాసును చూసి తట్టుకోలేకపోయింది. ప్రియుడి ఇంటి ముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ప్రశాంతిని కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్‌కు తీసుకెళ్లారు. కాలిన గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలొదిలింది. ప్రేమ ముసుగులో మోసం చేసిన ప్రియుడు వాసును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
