ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ నియోజకవర్గంలో విభరింతలపాడు గ్రామానికి చెందిన అబ్బూరి మాధురి (Abburi Madhuri)(34) అనే మహిళ టీడీపీ(TDP) కార్యకర్త రవితేజ అనే వ్యక్తి

ఎన్టీఆర్ జిల్లాలోని(NTR district) నందిగామ (Nandigama)నియోజకవర్గంలో విభరింతలపాడు గ్రామానికి చెందిన అబ్బూరి మాధురి (Abburi Madhuri)(34) అనే మహిళ టీడీపీ(TDP) కార్యకర్త రవితేజ అనే వ్యక్తి వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన మే 12, 2025న చోటుచేసుకుంది. అబ్బూరి మాధురి, ఉపాధి హామీ కూలీగా పనిచేస్తోంది. రవితేజ(Raviteja), ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ, మాధురిని నిరంతరం మానసికంగా వేధించినట్లు ఆమె సెల్ఫీ వీడియో(Selfie Video)లో చెప్పింది. ఈ వీడియోలో ఆమె తన బాధను వివరించి, రవితేజ వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది.

“నన్ను రవితేజ నోటికొచ్చినట్లు దూషించాడు. దౌర్జన్యం చేశాడు. అందరూ చూస్తుండగానే జరిగిందీ ఘటన. అయినా ఎవరూ నాకు సాయం చేయలేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తన మరణానికి ఫీల్డ్ అసిస్టెంట్ రవితేజనే బాధ్యుడిగా మాధురి వివ‌రించారు. తాను నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అభిమానిని అని, సీఎం చంద్ర‌బాబు(CM Chandrababu) అన్నా, తెలుగుదేశం పార్టీ అన్నా.. అమిత‌మైన అభిమానం అని, అమ‌రావ‌తి(Amaravati)లో జ‌రిగిన మోడీ స‌భ‌కు సొంత డ‌బ్బు ఖ‌ర్చు పెట్టుకొని వ‌చ్చాన‌ని మాధురి త‌న బాధ‌ను వ్య‌క్త‌ప‌రిచింది. “ర‌వితేజ చేతిలో నాకు జరిగిన అన్యాయం ఇంకో మహిళకు జరగకూడదు. నేను చనిపోతున్నా, కానీ నా పక్కన వున్న మహిళలు ఇలాంటి అవమానాలు చవిచూడకూడదు సెల్ఫీ వీడియోలో త‌న ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఇక చివరగా, తనకు న్యాయం చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకి విజ్ఞప్తి చేసింది. మాధురి మరణం గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.

ehatv

ehatv

Next Story