తాడేపల్లిలో(Tadepalli) నిర్మాణంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని(YCP Office) ఉదయం కూల్చివేశారు(demolish).

తాడేపల్లిలో(Tadepalli) నిర్మాణంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని(YCP Office) ఉదయం కూల్చివేశారు(demolish). అక్రమ కట్టడంగా పేర్కొంటూ తెల్లవారే సరికి అధికారులు కూల్చేశారు. హైకోర్టు ఆదేశాలు(High court) ఉన్నప్పటికీ కూల్చేశారని వైసీపీ నేతలు అంటున్నారు. తాడేపల్లిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం కోసం రెండు ఎకరాల భూమిని ౩౩ సంవత్సరాలకు లీజుకు కేటాయిస్తూ అప్పటి జగన్ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం మేరకు జీవోను స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, సీసీఎల్‌ఏ అధికారి జారీ చేశారు. అయినప్పటికీ ఆ నిర్మాణాన్ని అక్రమమని చెబుతూ కూల్చివేయడం దారుణమని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story