తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలను నిర్వహించిన లక్ష్మీపార్వతికి(Lakshmi parvathi) అప్పట్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం(AP Vishwa vidhyalaya) గౌరవ ఆచార్యులు(Professor) హోదాను కట్టబెట్టింది.

తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలను నిర్వహించిన లక్ష్మీపార్వతికి(Lakshmi parvathi) అప్పట్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం(AP Vishwa vidhyalaya) గౌరవ ఆచార్యులు(Professor) హోదాను కట్టబెట్టింది. ఇప్పుడా హోదాను ఉపసంహరించుకుంటున్నట్టు ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య ఎన్‌.కిశోర్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే లక్ష్మీపార్వతికి ఇప్పటి వరకు యూనివర్సిటీ నుంచి వేతనం చెల్లించలేదని అన్నారు. గతంలో ఆమె తెలుగు అకాడమి ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో విశ్వవిద్యాలయంలో పరిశోధకులకు మార్గదర్శకం అందించే బాధ్యత ఇచ్చారు. తాజాగా ఈ విధుల నుంచి కూడా తప్పించినట్లు పేర్కొన్నారు. ఆమె వద్ద మార్గదర్శకం కోసం చేరిన పరిశోధకులను తెలుగు విభాగంలో మరొక ఆచార్యునికి మార్పు చేయాలని ఆదేశించారు.

Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story