పార్టీ మార్పుపై వైసీపీ నేత(YCP Leader), మాజీ మంత్రి రోజా(RK Roja) స్పందించారు.

పార్టీ మార్పుపై వైసీపీ నేత(YCP Leader), మాజీ మంత్రి రోజా(RK Roja) స్పందించారు. నేను పార్టీ మారుతానా.. నేను పార్టీ మారే ప్రసక్తే లేదని రోజా స్పష్టం చేశారు. పార్టీకి ద్రోహం చేసినవారిని ఎవరూ క్షమించరని, పార్టీ ద్వారా అవకాశాలు పొంది నేడు పార్టీ మారడం తల్లికి ద్రోహం చేసినట్లేనని రోజా అన్నారు. వైసీపీని వీడుతున్న నేతలు ఒకసారి పునరాలోచించుకోవాలని రోజా సూచించారు. ఏపీలో మహిళలకు రక్షణ కరువైందని రోజా విమర్శించారు. విద్యార్థినుల బాత్రూంలలో కెమెరాలు పెట్టి పైశాచికానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రోజా. గుడ్లవల్లేరులో(Gudlavalleru college incident) ఏమీ జరగలేదని ఎస్పీ చెప్పడం సిగ్గుచేటని రోజా అన్నారు. మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళల భద్రతకే ముప్పు వచ్చే పరిస్థితి ఏపీలో నెలకొందని ఆమె విమర్శించారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story