ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై(Pawan kalyan) పోతిన మహేష్(Pothina mahesh) విమర్శలు గుప్పించారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై(Pawan kalyan) పోతిన మహేష్(Pothina mahesh) విమర్శలు గుప్పించారు. ప్రాయశ్చిత్త దీక్ష(Deeksha) ఎందుకోసం చేయాలి, లడ్డూపై చంద్రబాబు(Chandrababu) చేసిన తప్పుడు వ్యాఖ్యలపై ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని మమేష్ అన్నారు. లడ్డూ(Laddu) కల్తీపై ఒక్క ఆధారం చూపకుండా రాజకీయం చేస్తున్నారన్నారు. కులమతాలకతీతంగా పార్టీని ఏర్పాటు చేస్తున్నా, రాజకీయాలు చేస్తున్నా అని చెప్పుకునే పవన్‌ కల్యాణ్.. ఇప్పుడు సనాతన ధర్మం(Sanathana dharmam) అంటూ కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారన్నారు. మొన్నటి ఎన్నికల్లో కులాల ఆధారంగానే రాజకీయంచేశారని.. ఇప్పుడు దేవుడి పేరుచెప్పి మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పార్టీ సిద్ధాంతాలు ఏంటి.. మీరు చేస్తున్న రాజకీయాలేంటో పవన్‌ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. స్టీల్‌ ప్లాంట్ అమ్ముతున్నందుకు, విజయవాడ వరద బాధితులకు సాయమందించకపోవడం, జానీమాస్టర్‌ మైనర్‌ను లైంగికంగా వేధించినందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేసుకోవాలని పవన్‌ కల్యాణ్‌ను పోతిన మహేష్ విమర్శించారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story