యాంకర్‌ శ్యామల(Anchor shyamla) కొద్ది కాలానికే తనేమిటో రుజువు చేసుకున్నారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) అధికార ప్రతినిధిగా నియమితులైన యాంకర్‌ శ్యామల(Anchor shyamla) కొద్ది కాలానికే తనేమిటో రుజువు చేసుకున్నారు. ప్రెస్‌మీట్‌లలో కూటమి ప్రభుత్వ(TDP) వైఫల్యాలను ఆమె ఎండగడుతున్న తీరు ఆకట్టుకుంటోంది. ఇదే కొందరు వైసీపీ నేతలకు(YCP Leaders) కడుపు మండిస్తున్నది. ఎలాగైనా సరే ఆమెను పార్టీ నుంచి వెళ్లగొట్టలనే కుట్రకు తెర తీసినట్టు తెలుస్తోంది. ఇటీవల శ్యామల వరుసగా మూడు, నాలుగు ప్రెస్‌మీట్లను నిర్వహించారు. కేంద్ర కార్యాలయంలోనే జరిగిన ప్రెస్‌మీట్లను స్వయంగా వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డినే(YS Jagan) పెట్టించారు. శ్యామలకు పార్టీ అధినేత ప్రాముఖ్యతనివ్వడాన్ని కొందరు తట్టుకోలేకపోతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన బుల్లితెర నటుడునరసింహారెడ్డి- శ్యామల ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. శ్యామలది బ్రాహ్మణ సామాజికవర్గం. నరసింహారెడ్డి-శ్యామల దంపతులకు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అంటే ఎంతో అభిమానం. ఆ అభిమానంతోనే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కష్ట కాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పని చేయాలనే భావనతో వచ్చిన శ్యామలకు అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు జగన్‌. జగన్‌ ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె ఉత్సాహంగా పని చేయడం మొదలుపెట్టారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నారు. శ్యామలకు వస్తున్న ఆదరణ అటు తెలుగుదేశం పార్టీ సోషల్‌ మీడియా కూడా తట్టుకోలేకపోతున్నది. శ్యామలపై ఇష్టం వచ్చిన రాతలు రాస్తున్నది. ఆమెపై దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు కూటమి అభిమానులు. అసభ్యకరమైన రాతలు రాస్తున్నారు. వీటికి శ్యామల బెదిరిపోలేదు. పైగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఆ అడ్డమైన రాతలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో చక్కగా వివరించారు. ఇవన్నీ శ్యామలకు ప్లస్‌ అయ్యాయి. చ‌క్క‌టి వాగ్ధాటి ఆమె సొంతం. ఆక‌ట్టుకునే రీతిలో మాట్లాడటం ఆమెకు కొట్టిన పిండి. అందుకే అచిరకాలంలోనే జగన్‌ అభిమానాన్ని చూరగొన్నారు. ఇదే కొందరు వైసీపీ నేతలకు కడుపునొప్పి తెస్తున్నది. ఈర్ష అసూయలను వెళ్లగక్కుతున్నారు. శ్యామలతో ప్రెస్‌మీట్లు పెట్టనివ్వకూడదనే కుట్రకు తెర తీశారట! ఇవన్నీ జగన్‌కు తెలుసో తెలియదో!

Updated On
Eha Tv

Eha Tv

Next Story