ఏపీలో మహిళలపై ఆకృత్యాలు పెరిగాయాయని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు.

ఏపీలో మహిళలపై ఆకృత్యాలు పెరిగాయాయని వైసీపీ(YCP) అధికార ప్రతినిధి శ్యామల(Shyamla) అన్నారు. మహిళలు, బాలికలకు రక్షణ లేదని.. మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యత లేనట్లు వ్యవహరిస్తున్నారని శ్యామల అన్నారు. మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడంలో విఫలమయ్యారు.

ప్రభుత్వ పెద్దలకు సామాజిక బాధ్యత లేదని.. మహిళా హోంమంత్రి ఎందుకు స్పందించడంలేదని శ్యామల ప్రశ్నించారు. వైసీపీ హయాంలో దిశ యాప్‌ను(Disha App) తీసుకొచ్చాం.. దిశ యాప్‌తో వేలాది మంది మహిళలకు అండగా నిలిచామన్నారు. జగన్‌కు(YS Jagan) మంచి పేరు వస్తుందని దిశ యాప్‌ను తీసేశారన్న శ్యామల, దిశయాప్‌ను ఎందుకు తీసేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రతిరోజు ప్రతిపక్ష పార్టీల నేతలను విమర్శించే హోంమంత్రికి శాంతి భద్రతలు కాపాడాలన్న సోయి లేదన్నారు. మహిళా హోంమంత్రి ఉండి రాష్ట్రాంలో మహిళలకు రక్షణలేకపోవడం శోచనీయమని.. శాంతిభద్రతలు అదుపు చేయలేకపోతే హోంమంత్రిగా అనిత దిగిపోవాలని శ్యామల అన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story