వైసీపీ(YCP) అధికార ప్రతినిధి శ్యామల(Shyamla) మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

వైసీపీ(YCP) అధికార ప్రతినిధి శ్యామల(Shyamla) మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ(Women saftey) లేదని.. మహిళల హత్యలపై(Murders) ప్రభుత్వానికి పట్టింపేలేదని విమర్శించారు. గుడ్లవల్లేరు కాలేజ్‌(Gudlavalleru college) అంశాన్ని డైవర్ట్ చేశారని.. హోంమంత్రిగా మహిళ ఉన్నా న్యాయం జరగడంలేదని శ్యామల ఆరోపించారు. దిశ చట్టంతో జగన్‌(YS Jagan) అన్న మహిళలకు ఉంటే ఈ ప్రభుత్వం ఆ వ్యవస్థను భ్రష్టుపట్టించారన్నారు.

అభూత కల్పనలతో తప్పించుకుంటున్నారని..రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదంటూ అధికార ప్రతినిధిగా తన పేరును ప్రకటించిన నాటి నుంచి టీడీపీ సోషల్‌ మీడియా తనను టార్గెట్ చేసిందన్నారు. నా ఫోన్‌ నెంబర్‌ను సోషల్‌ మీడియా వేదికల్లో పోస్టు చేసి బూతులతో కామెంట్స్‌ చేస్తున్నారని ఆధారాలతో సహా బయటపెట్టారు. సినిమా ఇండస్ట్రీ నుంచి మహిళలు వస్తే ఇష్టారీతిన మాట్లాడుతారా అని ప్రశ్నించారు. రోజుకు వందల ఫోన్లు చేసి తనను వేధిస్తున్నారని శ్యామల అన్నారు. అయినా భయపడే ప్రసక్తేలేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటానని.. వృత్తి పరంగా తన అవకాశాలను తీసేయించారని.. ఇంత కన్నా నన్ను ఇంకేం చేస్తారని.. నేను ఎవరికీ భయపడనని హెచ్చరించారు శ్యామల

Updated On
Eha Tv

Eha Tv

Next Story