వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) సోషల్‌ మీడియా యాక్టివిస్టు(Social media activist) వర్రా రవీంద్రారెడ్డిని(Varra ravindra reddy) పోలీసులు(Police) చిత్ర హింసలు(Torture) పెట్టారట!

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) సోషల్‌ మీడియా యాక్టివిస్టు(Social media activist) వర్రా రవీంద్రారెడ్డిని(Varra ravindra reddy) పోలీసులు(Police) చిత్ర హింసలు(Torture) పెట్టారట! చితకబాదారట! వై.ఎస్‌.విజయమ్మ(YS Vijayamma), వై.ఎస్‌.షర్మిల(YS Sharmila), నర్రెడ్డి సునీతపై(YS Sunitha) అభ్యంతరకర పోస్టులు పెట్టాలని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి(Avinash reddy) ఆదేశించినట్టు చెప్పాలని పోలీసులు ఇష్టం వచ్చినట్టుగా కొట్టారట! ఈ విషయాలను మేజిస్ట్రేట్‌తో చెప్పుకుని ఆవేదన చెందారు వర్రా రవీంద్రారెడ్డి. ఇటీవల వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు సోమవారం అతడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. వై.ఎస్‌.విజయమ్మ, వై.ఎస్‌.షర్మిల, సునీతపై అవినాష్‌రెడ్డి చెబుతుంటే ఆయన పీఏ రాఘవరెడ్డి రాసుకుని , వాటిని రవీంద్రారెడ్డి ద్వారా సోషల్‌ మీడియాలో పెట్టించారని పోలీసులు చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా దీనికి విస్తృతంగా ప్రచారం చేసింది. ఇప్పుడు మేజిస్ట్రేట్‌ ఎదుట రవీంద్రారెడ్డి నిజాలు చెప్పుకున్నారు. తనను ఊరూరా తిప్పుతూ ఎలా చిత్ర హింసలు పెట్టారో వివరించారు. రవీంద్రారెడ్డి చెప్పిన విషయాలను మేజిస్ట్రేట్‌ రికార్డు చేసుకున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story