తిరుమల లడ్డూపైనా(Tirumala laddu), ఆ దివ్యక్షేత్రం పవిత్రతపైనా చంద్రబాబు(Chandrababu) సర్కారు చేస్తున్న అసత్య ఆరోపణ

తిరుమల లడ్డూపైనా(Tirumala laddu), ఆ దివ్యక్షేత్రం పవిత్రతపైనా చంద్రబాబు(Chandrababu) సర్కారు చేస్తున్న అసత్య ఆరోపణలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) డిసైడయ్యారు. చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయడానికి శనివారం రోజు పూజలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు.

'తిరుమల పవిత్రత.. స్వామివారి ప్రసాదం విశిష్టత.. వెంకటేశ్వరస్వామి వైభవాన్ని.. టీటీడీ పేరు ప్రఖ్యాతులను.. వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రత.. రాజకీయ దుర్బుద్ధితో.. కావాలని అబద్ధాలాడారు. జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా.. ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా.. అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబర్‌ 28 శనివారం రోజున పూజల్లో పాల్గొనాలని వైఎస్సార్‌సీపీ పిలుపునిస్తోంది' అని జగన్‌ ట్వీట్‌ చేశారు. అదే రోజున జగన్‌ తిరుమలకు వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. అక్కడే ప్రత్యేక పూజలు చేస్తారని సమాచారం.

Updated On
Eha Tv

Eha Tv

Next Story