Facts Of Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్ స్కెచ్ ఎవరిది..?
తెలుగుదేశం పార్టీ(TDP) అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్(Chandrababu Arrest) వెనుక అసలేం జరిగింది? అరెస్ట్‌పై ఇప్పటి వరకు జరుగుతున్న చర్చకు భిన్నమైన కొంత సమాచారాన్ని అందించబోతున్నాము. ఈ అరెస్ట్ కేవలం జగన్మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) అనుకుని చేసిన అరెస్ట్‌గా భావించాలా? రాజకీయ కక్షతో చేసిన అరెస్టని అనుకోవాలా?

Facts Of Chandrababu Arrest
తెలుగుదేశం పార్టీ(TDP) అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్(Chandrababu Arrest) వెనుక అసలేం జరిగింది? అరెస్ట్‌పై ఇప్పటి వరకు జరుగుతున్న చర్చకు భిన్నమైన కొంత సమాచారాన్ని అందించబోతున్నాము. ఈ అరెస్ట్ కేవలం జగన్మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) అనుకుని చేసిన అరెస్ట్‌గా భావించాలా? రాజకీయ కక్షతో చేసిన అరెస్టని అనుకోవాలా? జగన్మోహన్ రెడ్డి అనే ఓ వ్యక్తి తల్చుకుంటే ఓ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతను ఏ మాత్రం ఆధారాలు లేవని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న ఓ కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపించడం సాధ్యమవుతుందా? పైగా గడచిన నాలుగున్నరేళ్లుగా న్యాయస్థానాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన పరిస్థితి ఎలా ఉందో సగటు ఆంధ్రప్రదేశ్ పౌరులలో ఎవరిని అడిగినా చెబుతారు. ఎన్ని కేసులలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయో మనం చూశాం. అలాంటిది చంద్రబాబుపై కేసు పెట్టి జైల్లో వేసేటంత సాహసం చేస్తారా? కోర్టు తీప్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే అది అప్రతిష్ట కాదూ! మరి చంద్రబాబు అరెస్ట్ వెనుక ఉన్నదెవరు? వారికి చంద్రబాబుపై అంత కోపం ఎందుకు వచ్చింది? ఆ ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం!
