YNR Analysis: బీజేపీపై టీడీపీ మీడియా ఉక్రోషం..! జర్నలిస్ట్ 'YNR' ఎనాలసిస్..!

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు పెట్టిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపడం, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి ఆనందాన్ని కలిగించి ఉంటుంది, కానీ భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆంధ్రప్రదేష్‌లోని కూటమి సర్కారుని మోస్తున్న తెలుగుదేశం పార్టీ మీడియాకు మాత్రం చాలా ఇబ్బందిగా కనపడుతుంది. చాలా చాలా ఇబ్బంది వాళ్ళలో మనకి అర్థమవుతుంది, వాళ్ళ ఇబ్బంది ఏంటో తెలుస్తుంది, వాళ్ళ అసహనం కనపడుతుంది, భారతీయ జనతా పార్టీ ఎలా తీసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి మద్దతు, భారతీయ జనతా పార్టీ ఎలా ఫోన్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డికి, భారతీయ జనతా పార్టీకి ఏమి అవసరం వచ్చింది జగన్మోహన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ గెలవలేదా జగన్మోహన్ రెడ్డి లేకపోతే, జగన్ లేకపోయినా ఉపరాష్ట్రపతి ఎన్నికలో మనం గెలుస్తాం కదా అటువంటప్పుడు, ఆయనకి ఎందుకు ఫోన్ చేశారు అంటూ లోపల లోపల కుమిలిపోతున్నారు, రగిలిపోతున్నారు, బాధపడిపోతున్నారు. మనకు చెప్పకుండా డైరెక్ట్ గా ఆయనకి ఫోన్ చేసి మాట్లాడడం ఏంటి, మనకి ఆయన శత్రువు కదా, వాళ్ళకి కూడా శత్రువే కావాలి కదా, మనకి ఆయన అంటే పడదు కదా, వాళ్ళకి కూడా పడకుండా ఉండాలి కదా, మనం అర్జెంట్ గా జైలుకి పంపించాలి అనుకుంటున్నాం, వాళ్ళు కూడా పంపించాలి అనుకోవాలి కదా, అనుకోకపోతే ఎట్లా, అనే ఆలోచన ధరణి తెలుగుదేశం పార్టీ మీడియాలో కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం కోసం పాకులాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఫోన్ చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడెప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడదామా అని తహతహలాడుతున్నారు, ఇది వాళ్ళు ఆంధ్రప్రదేష్‌ రాష్ట్ర ప్రజలకు చెప్తున్న మాట. జగన్మోహన్ రెడ్డికి. భారతీయ జనతా పార్టీ అగ్రనేత రాజనాథ్ సింగ్ ఫోన్ చేసిన సందర్భంలో .ఆయన చెప్పిన మాట పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని. ఆయన ఫోన్ చేసిన తర్వాత 48 గంటలకో , 72 గంటలకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సో బీజేపీ ఫోన్ చేసిన తర్వాత రెండు మూడు రోజులు సమయం తీసుకొని వైసీపీ మద్దతు ప్రకటిస్తే, జగన్మోహన్ రెడ్డి బీజేపి మద్దతు ఇవ్వడం కోసం పాకులు అడినట్టు అయిందా, జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మద్దతు ఇవ్వడం కోసం వెంటపడ్డట్టు అయిందా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళకి కనీసం అర్థం అవుతుంది కదా, కాస్త కామన్ సెన్స్ ఉన్నవాళ్ళకి ఎవరికైనా అర్థం అవుతుంది కదా, మీకు అర్థం కాకపోవడం ఏంటి, భారతీయ జనతా పార్టీ మీరు ఎవరితో ఉండమంటే వాళ్ళతో ఉండాలి, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేష్‌ రాష్ట్ర ప్రజలందరికీ శత్రువు అని, తెలుగుదేశం పార్టీ భావిస్తే, తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తే, అందరూ దాన్ని నమ్మి భారతీయ జనతా పార్టీ శత్రువు అనుకోవాలి. ఇదే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..

ehatv

ehatv

Next Story