YNR Analysis: ఎన్డీఏకు జైకొట్టిన వైఎస్‌ఆర్సీపీ..!

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోనే ఎన్డీఏ ప్రతిపాదించిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్‌కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. నిజానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏలో పార్ట్నర్ కాదు, ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అభ్యర్థిని ప్రకటించిన మీదట, ఇమ్మీడియట్ గా అభ్యర్థిని ప్రకటించిన తర్వాత, ఆల్మోస్ట్ మొదటి ఫోన్ కాల్ అనుకుంటా, భారతీయ జనతా పార్టీ ముఖ్యనేత రాజ్‌నాథ్‌సింగ్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చేశారు, జగన్మోహన్ రెడ్డికి రాజనాథ్ సింగ్ ఫోన్ చేసిన సందర్భంగా ఆయన ఏం చెప్పారు అనే విషయం, వైసార్ కాంగ్రెస్ పార్టీ బయటకు విడుదల చేసింది, ఓ లేఖ రూపంలో ఆయన చెప్పింది, మా పార్టీలో చర్చించి మేము నిర్ణయం తీసుకుంటాము అని, సో పార్టీలో చర్చించిన మీదట నిర్ణయం తీసుకున్నాం, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మేము మద్దతు ఇవ్వబోతున్నామంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది, సో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ప్రకటన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతును అర్ధించిన, ఎన్డీఏకి ఆనందాన్ని తెప్పించాలి, ఎన్డీఏ నాయకులు హర్షం ప్రకటించి ఉండాలి కదా, మీరు మద్దతు ఇవ్వండి అని అడిగారు, వాళ్ళు మద్దతు ఇచ్చారు, థాంక్స్ చెప్తాం, సంతోషం వ్యక్తం చేస్తాం, మద్దతు ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేస్తాం, కానీ భారతీయ జనతా పార్టీతో పాటు కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఆందోళన కనబడుతోంది, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం అనేది, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైన్ మాత్రమే చెప్తాది, దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడదాం, తెలుగుదేశం పార్టీ ఆందోళన ఇంకో వీడియోలో చెప్తా, మీకు సో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎన్డీఏకు మద్దతు ఇచ్చింది, ఎన్డీఏ ఎందుకు మొదటి కాల్ జగన్మోహన్ రెడ్డికే చేసింది, నిజానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బీఆర్‌ఎస్‌ పార్టీ గాని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాని అటు ఎన్డిఏ లో, ఇటు ఇండియ కూటంలో లేవు, మధ్యస్థంగా ఉన్నాయి. సో రెండు కూటములకు దూరంగా ఉన్న ఈ రెండు పార్టీలు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలుగా ఉన్నాయి, ఈ రెండు పార్టీల్లో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే బిజెపీ నాయకత్వం నుంచి ఫోన్ వచ్చింది, బిఆర్ఎస్ పార్టీకి రాలేదు, నిన్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటలను బట్టి చూస్తే, మాకు వాళ్ళు ఫోన్ చేయలేదు, వీళ్ళు ఫోన్ చేయలేదు అంటూ ఆయన చెప్పారు. సో భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి బయట ఉన్నా మావాడే అనుకుంటుందా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని కనీసం కన్సిడర్ చేయకుండానే, వాళ్ళతో మాట్లాడకుండానే ,వాళ్ళకి ఏమన్నా కోపం వస్తుందేమో అని ఆలోచన కూడా చేయకుండానే, జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ లోపల ఉన్నా మనోళ్ళు కాదు అని అనుకుంటుందా, బయట ఉన్న జగన్మోహన్ రెడ్డి మనవాడే, ఎక్కడున్నా లోపల ఉన్న టిడిపి మనతో ఉన్నట్టు కాదు, అది మనతోటే ఉన్నా అని భారతీయ జనతా పార్టీ భావిస్తుందా, అనే ఇంప్రెషన్ కలుగుతుంది.ఇదే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..

ehatv

ehatv

Next Story