love Scam : ప్రేమ పేరుతో మోసపోయిన యువతి.. అన్న గర్భవతిని చేస్తే తమ్ముడితో పెళ్లి..!
యువతిని మోసం చేసి గర్భవతి చేసిన అన్న.. తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసిన బంధువులు.

యువతిని మోసం చేసి గర్భవతి చేసిన అన్న.. తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసిన బంధువులు. సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ నాకు న్యాయం చేయండంటూ వీడియో చేసిన బాధితురాలు. నాకు న్యాయం చేయండి అంటూ పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు. ఏఆర్ కానిస్టేబుల్, దుర్గాప్రసాద్ ఇద్దరు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు అంటూ యువతి ఆవేదన చెందుతూ వీడియోలో వేడుకోలు.
'పల్నాడు జిల్లా చిలకలూరిపేట(chilakaluri peta)లో నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామికి చెందిన సోడిశెట్టి మంజు భార్గవి (Sodishetti Manju Bhargavi)చదువు నిమిత్తం నానమ్మ గారి ఊరైన అద్దంకికి వెళ్లి చదువుకునే సమయంలో విశ్వ భారతి జూనియర్ ఇంటర్ కాలేజీ డైరెక్టర్ మాకు దూరపు బంధువు నాకు వరస అయ్యే సోడిశెట్టి రామానాయుడు నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడి పెళ్ళి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి లొంగదీసుకుని వాడుకొని గర్భవతిని చేశాడు.తనను పెళ్లి చేసుకోకుండా అధిక కట్నం స్థిరాస్తులకు ఆశపడి వేరొకరితో పెళ్ళికి సిద్ధమైన సమయంలో న్యాయం చేయమని నరసరావుపేట దిశ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన యువతి.
ఆ సమయంలో అతని తల్లి సోడిశెట్టి వెంకటసుబ్బమ్మ(sodishetti venkata subbamma), వారి బంధువులు ధర్మవరపు దుర్గాప్రసాద్(Durga prasad), మేకల నరేంద్ర (Mekala Narendra)(ఏ.ఆర్. కానిస్టేబుల్) వచ్చి అతనితో పెండ్లి చేస్తామని యువతిని నమ్మించి తీసుకెళ్లారు. యువతికి బంధువులు కావడంతో వారి మాటలు నమ్మి వారితో వెళ్లగా, యువతికి మాయమాటలు చెప్పి గర్భవతిని చేసిన రామానాయుడు నీకంటే చాలా పెద్దవాడని, అతనికి బదులుగా అతని తమ్ముడు అయిన సోడిశెట్టి కామేశ్వరరావుకు ఇచ్చి పెళ్లి చేస్తామని అతను నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాడని చెప్పిన సోడిశెట్టి వెంకటసుబ్బమ్మ, మిగిలిన వ్యక్తులు. అందుకు యువతి అంగీకరించకపోయినా... తన మాటలు వినకపోతే ఆత్మహత్య చేసుకుంటామని, ఇరు కుటుంబాల పరువు పోతుందని బెదిరించిన కుటుంబ సభ్యులు.
యువతిని ఒప్పించి రామానాయుడు (Ramanaidu)సోదరుడు కామేశ్వరరావు(Kameswararao)తో గ్రామ పెద్దల సమక్షంలో గుడిలో కుటుంబ సభ్యులు వివాహం జరిపించారు. పెండ్లి అయిన తర్వాత 3 రోజులకు 16 రోజుల పండుగ నాటికి వస్తాను అని చెప్పి వెళ్ళిన కామేశ్వరరావు. అనంతరం నీకు నేనే దిక్కు వాడు రాడు నిన్ను నేను చూసుకుంటా నా మాట విను అంటూ యువతికి అసభ్యకరమైన మెసేజీలు పెట్టిన రామానాయుడు. ఈ క్రమంలో కామేశ్వరరావుకి ఫోన్ చేసి విషయం చెప్పగా నువ్వు మా అన్నయ్య గురించి ఏమి చెప్పినా వినను నీకు తగిన శాస్తి చేశాము అని ఫోన్ పెట్టేశాడు, తన అత్తయ్యకు విషయం చెపితే నాకు తెలియదు, వాడికి నువ్వు అంటే ఇష్టము లేదు, ఏమి చేసుకుంటావో చేసుకో నీకు దిక్కు ఉన్న చోట చెప్పుకో అంటూ బెదిరించడంతో యువతి భోరుమంది. చేసేదేమీలేక పుట్టింటికి వెళ్ళిపోయిన యువతి.. అనంతరం అత్తింటి వారితో పెద్దమనుషులతో పలు మార్లు మాట్లాడగా వాడు ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు వెతుకుతున్నాం అని 14 నెలలుగా కాలయాపన చేసిన కుటుంబసభ్యులు.
ఈ క్రమంలో యువతిని తీసుకొని తల్లిదండ్రులు.. అత్తవారింటికి తీసుకెళ్ళి అత్తయ్య బంధువులతో మాట్లాడి.. మీ అబ్బాయి వచ్చే వరకు అమ్మాయి ఇక్కడే ఉంటుందని అప్పటి వరకు మా తల్లి గారు నాతోనే ఉంటుందని అత్తవారికి చెప్పి వెళ్ళిపోయిన బంధువులు. తన అత్తగారి ఇంట్లో నిద్రపోయి తెల్లవారి నిద్రలేచేసరికి చెప్పాపెట్టకుండా ఇల్లు వదలి వెళ్ళిపోయిన అత్త, నాటినుండి అమ్మతో కలిసి అక్కడే ఉంటున్న యువతి. అయితే మీ ఆయనను నిన్ను ఒక్కటి చేస్తామని నమ్మబలికి, మాతో మాటలు కలిపి వస్తూ పోతూ ఏఅర్ కానిస్టేబుల్ మేకల నరేంద్ర, ధర్మవరపు దుర్గాప్రసాద్ లు యువతి ఫోన్ ను హ్యాక్ చేసి తనకు సంబంధం లేకుండా ఫోన్ నుంచి మెసేజ్లు, ఫోన్ కాల్స్ వెళ్లేటట్టుగా చేసి తనను తిరుగుబోతు దానిగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశారని యువతి వాపోయింది. అంతేకాకుండా పలుమార్లు ఏఅర్ కానిస్టేబుల్ మేకల నరేంద్ర,ధర్మవరపు దుర్గాప్రసాద్ హత్యాయత్నం చేశారని ఆరోపించింది. తనకు జరిగినట్టు మరో ఆడపిల్లకు అన్యాయం జరగకుండా ఉండాలని సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan), నారా లోకేష్(Nara lokesh), హోంమంత్రి అనిత(Anitha)కి విజ్ఞప్తి చేస్తూ వీడియో విడుదల చేసిన యువతి
- PalnaduChilakaluripetaIrlapaduwoman deceivedpregnantforced marriageSodishetti Manju BhargaviSodishetti RamanayuduSodishetti Kameswara Raolove scamNarasaraopet Disha policeAR constableMekala NarendraDharmavrapu Durgaprasadharassmentphone hackingmurder attemptsjusticeCM ChandrababuDeputy CM Pawan KalyanNara LokeshHome Minister Anitavideo appealehatv
