అత్యాచార కేసులో చిక్కుకున్న యూ ట్యూబర్‌ హర్ష సాయి ఎక్కడున్నాడు? పోలీసులు అతడి ఆచూకిని ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు?

అత్యాచార కేసులో చిక్కుకున్న యూ ట్యూబర్‌ హర్ష సాయి ఎక్కడున్నాడు? పోలీసులు అతడి ఆచూకిని ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? కేసు ఇంత ఆలస్యం ఎందుకు అవుతోంది? నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌లో హర్షసాయి(Harsha Sai)పై కంప్లయింట్‌ నమోదయ్యి ఇంచుమించు వారం రోజులు అవుతోంది. ఇప్పటికీ హర్షసాయి కోసం వెతుకుతూనే ఉననారు. తనపై రేపు కేసు నమోదైనప్పటి నుంచి హర్షసాయి పరారీలో ఉన్నాడు. ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసుకున్నాడు. కాకపోతే సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. ఆడియో లీకులు ఇస్తున్నాడు. స్టోరీ డిస్కషన్‌ కోసం ఇంటికి పిలిపించి, మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్‌ ఇచ్చి తనపై అత్యాచారం చేశాడన్నది బాధితురాలి ఫిర్యాదు. అవన్నీ తప్పుడు ఆరోపణలని , డబ్బు కోసం కావాలని ఇలా డ్రామా ఆడుతున్నదని ఓ ట్వీట్‌ చేశాడు హర్షసాయి. ఇదిలా ఉంటే హర్షసాయి విదేశాలకు పారిపోయేట్టుగా ఉన్నాడని సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి(CP Avinash Mahanty)కి కంప్లయింట్‌ చేశారు బాధితురాలు. సోషల్ మీడియాలో తనపై ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌(Jani Master)ను చటుక్కమని పట్టేసుకున్న పోలీసులు హర్షసాయిని ఎందుకు పట్టుకోవడం లేదనే చర్చ మాత్రం జరుగుతోంది..

Updated On
ehatv

ehatv

Next Story