నా కుటుంబంలోకి వస్తారా..!

అక్టోబర్ 12న నేను ట్వీట్ చేసే వరుకూ ఈ ప్రభుత్వం ఇక్కడ డయేరియా ప్రబలుతుందన్న విషయాన్ని గుర్తించడానికి కూడా ముందుకు రాలేదని జగన్‌ (YS Jagan)విమర్శించారు. తరువాత కూడా, 11 మంది మరణాలను కప్పిపుచ్చి, కేవలం ఒక్కరే మరణించారన్ని సాక్షాత్తు కలెక్టరే స్టేట్మెంట్ ఇవ్వడం ధౌర్భాగ్యమని ఆయన అన్నారు. కలెక్టర్ ఒకటే డయేరియా మరణం అని చెప్పిన తరువాత పవన్ కళ్యాణ్(Pawan kalyan) వచ్చి 10 మరణాలు అని చెప్పి వెళ్లాడు.

నేను ఇక్కడకు వస్తున్నాని తెలిసి , టాపిక్ డైవర్ట్ చేశారు. నా చెల్లి, తల్లి, నా ఫొటోలు వేసి కుటుంబ విషయాల్లో తలదూర్చుతున్నారన్నారు. అయ్యా.. చంద్రబాబూ(Chandrababu), రాధాకృష్ణ(Radhakrishna), టీవీ5 నాయుడూ, ఈనాడు... మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ వివాదాలు లేవా అన్నారు. మీ ఇళ్లలో లేవా కుటుంబ తగాదాలు అని జగన్‌ ప్రశ్నించారు. అధికారం ఇచ్చింది పాలన చేయాలని.. ఇలాంటి విష ప్రచారాలు చేయాలని కాదన్నారు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా బాధితులను జగన్‌ పరామర్శించారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story