Ys Jagan : మహేష్‌బాబు ఫ్లెక్సీతో జగన్ ఫ్యాన్స్ హల్చల్..!
ఆంధ్రప్రదేష్‌లో వైయస్ జగన్మోహన్ రెడ్డికి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేష్‌లో వైయస్ జగన్మోహన్ రెడ్డికి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా జగన్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా మహేష్‌బాబు ఫ్లెక్సీతో జగన్ ఫ్యాన్స్ హల్‌చల్ చేశారు. గతంలో ఖలేజా సినిమా రీరిలీజ్ సందర్భంగా కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక సెంటర్‌లో మహేష్ బాబు ఫ్లెక్సీలతో పాటు వైసీపీ జెండాలతో హల్చల్ చేశారు యువకులు. దింతో జై బాబు, జై జగన్ అంటూ నినాదాలు చేశారు. మరోసారి జగన్ నాంపల్లి కోర్టుకు వస్తున్న సందర్బంగా ఈరోజు కోర్టు ఆవరణలో జగన్ ఫొటోతో పాటు మహేష్‌బాబు ఫ్లెక్సీతో హడావిడి చేశారు. జై జగన్ అంటూ వైసీపీ జెండాలతో నినదించారు. జగన్ పర్యటన నేపథ్యంలో అటు గన్నవరం ఇటు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ల వద్ద కోలాహలం నెలకొంది. బేగంపేట ఎయిర్‌పోర్ట్ దగ్గరకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. వాళ్లకు అభివాదం చేస్తూ జగన్ ముందుకు కదిలారు. దారి పొడవునా ఆయన వెంట భారీ ర్యాలీగా వెళ్లారు.


