నిన్న విజయవాడ వైసిపి కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

నిన్న విజయవాడ వైసిపి కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగనన్న 1.0 లో కార్యకర్తలకు అంత గొప్పగా ఏం చేయలేకపోయి ఉండొచ్చని అన్నారు.

తనకు ప్రతి విషయంలో ప్రజలే గుర్తుకు వచ్చి వారి కోసమే తపనపడ్డానని, అందుకే తన సమయాన్ని ప్రజల కోసమే కేటాయించినట్లు చెప్పుకొచ్చారు.


కానీ మన కార్యకర్తలని కూటమి ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందుల్ని చూస్తున్నట్లు జగన్(YS Jagan) తెలిపారు. ఈ క్రమంలోనే జగనన్న 2.0 పాలన వేరే లెవెల్ లో ఉంటుందన్నారు. 2.0 లో కార్యకర్తల కష్టాలు ఏంటో చూశానని.. చంద్రబాబు కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులు చూస్తున్నానని అన్నారు. కార్యకర్తల కోసం జగన్ గట్టిగా నిలబడతాడని అన్నారు. వైసిపి బతుకుతుందని, రాష్ట్రాన్ని 30 ఏళ్ల పాటు ఏలుతుందని అన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఎవరూ పార్టీ కార్యకర్త వెంట్రుక కూడా పీకలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో మేనిఫెస్టోలో 90% హామీలు అమలు చేశామని తెలిపారు. అప్పుడేమో హామీలు అమలు చేయకపోతే కాలర్ పట్టుకోమన్నారని, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారని కూటమి ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. సంపద సృష్టించడం ఎలాగో తమనే చెప్పమంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ మాటలతో వైసిపి క్యాడర్ లో నూతన ఉత్సాహాన్ని నింపాయనే చెప్పాలి. త్వరలో జిల్లాల పర్యటన చేయబోతున్న జగన్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ క్యాడర్ లో బలాన్ని చేకూర్చాయి.

Updated On
ehatv

ehatv

Next Story