YS Jagan Meets Saalman Family: వైఎస్ జగన్‌ను కలిసిన సాల్మన్‌ కుటుంబం.. పిన్నెల్లి గ్రామస్తులు..!

గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో వైసీపీ కార్యకర్త సాల్మన్‌ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. టీడీపీ కార్యకర్తల చేతుల్లో హతమయ్యాడని వైసీపీ ఆరోపిస్తుంది. దీంతో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్రంగా ఖండించి.. బాధిత కుటుంబానికి ఆసరాగా ఉంటామని ప్రకటించారు. ఈ క్రమంలో పిన్నెల్లి గ్రామస్తులు బుధవారం వైఎస్‌ జగన్‌ను కలిశారు.

పిన్నెల్లి గ్రామస్తులతో పాటు, సాల్మన్‌ కుటుంబం కూడా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయానికి వచ్చింది. తమ తండ్రిని రాజకీయ కక్షతోనే అత్యంత కిరాతకంగా చంపారని సాల్మన్‌ కుమారులు మరియదాసు, భిక్షం(ప్రవీణ్‌), కుమార్తె రాహేలు జగన్‌ వద్ద వాపోయారు. తండ్రి మరణంతో తమ కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధైర్య పడొద్దని, పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇలాంటి వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. పార్టీ తరఫున లీగల్‌ సెల్‌ అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని చెప్పారు.

Updated On
ehatv

ehatv

Next Story