2027లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో పాదయాత్ర (పాదయాత్ర 2.0) చేయనున్నట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు.

2027లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో పాదయాత్ర (పాదయాత్ర 2.0) చేయనున్నట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (Ysrcp)నాయకుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) విశాఖపట్నం(vizag)లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ ఇంకా కోలుకోలేని నేపథ్యంలో, ఈ పాదయాత్ర గతంలో చేసిన ప్రజా సంకల్ప యాత్రలా గొప్పగా ఉంటుందని, పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు ఐదేళ్లు త్వరగా గడిచిపోతాయని అమర్నాథ్ అన్నారు. జగన్ స్వయంగా ఈ పాదయాత్ర గురించి నాయకులతో చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. పార్టీ కమిటీలను పునర్వ్యవస్థీకరించడం, కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడం జరుగుతుందని, నిజమైన విధేయులు మాత్రమే పార్టీలో ఉండాలని సూచించారు.2027 ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర రాజకీయంగా కీలకమైన ప్రజా సంపర్క కార్యక్రమంగా ఉండవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

పార్లమెంటరీ పార్టీ నేతలతో సమావేశం సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చేది కచ్చితంగా వైసీపీ(YCP)నే. వచ్చే ఏడాది బ్రహ్మాండంగా ప్లీనరీని నిర్వహిస్తా’ అని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి (Ys jagan)ప్రకటించారు. తాడేపలి(Tadepalli)లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ సమన్వయకర్తలతో జగన్‌ సమావేశమయ్యారు. ‘చంద్రబాబులా నేను అబద్ధ్దాలు చెప్పను. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలోని సంక్షేమ పథకాలన్నింటిని రద్దు చేశారు. కేసులు లేకుండా రాజకీయాలు ఉండవు. పోలీసు కేసులకు భయపడవద్దు. రాష్ట్రంలో 12 నెలలుగా చంద్రబాబు(CM Chandrababu) రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. ప్రజలు భయాందోళనల్లో బతుకుతున్నారు. వైసీపీని అభిమానించేవారిని కొడుతున్నారు. ఇది నన్ను బాధిస్తోంది. నా అభిమానులను రక్షించుకోవాల్సిన బాధ్యత నాపైనే ఉంది’ అని జగన్‌ అన్నారు.

ehatv

ehatv

Next Story