వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీని పునర్వ్యవస్థీకరించడంపై దృష్టి సారించారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీని పునర్వ్యవస్థీకరించడంపై దృష్టి సారించారు. పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయి. జగన్ వైఎస్‌ఆర్సీపి(Ysrcp) కేంద్ర కార్యాలయంలో జిల్లా అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నిర్మాణంపై మూడు దశల్లో లక్ష్యాలను నిర్దేశించారు. మే 2025 నాటికి మండల కమిటీల ఏర్పాటు చేశారు. జూన్-జూలై 2025లో గ్రామ, మున్సిపల్ డివిజన్ కమిటీల ఏర్పాటు చేశారు. ఆగస్టు-అక్టోబర్ 2025 నాటికి బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి 1,500 మంది కార్యకర్తలను సమీకరించి, వారిని పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా ఉంచాలని జగన్(Ys Jagan) సూచించారు. పార్టీలో వ్యవస్థీకృత నిర్మాణాన్ని ఏర్పాటు చేయడంపై జగన్ దృష్టి పెట్టారు. జిల్లా నాయకత్వానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ, కార్యకర్తలు, నాయకుల సమన్వయంతో పార్టీని బలోపేతం చేయాలని ఆదేశించారు. పార్టీలో అధికారిక హోదాలో సేవ చేయాలనుకునే వారు స్థానిక నాయకత్వంతో కలిసి పనిచేయాలని, దీనివల్ల గుర్తింపు లభిస్తుందని సూచించారు. 2024 ఎన్నికల్లో YSRCP కేవలం 11 సీట్లు గెలుచుకోవడంతో, జగన్ ప్రజలతో మళ్లీ అనుసంధానం చేసేందుకు కృషి చేస్తున్నారు. 40% ఓటు షేర్ ఉన్నప్పటికీ, 2019లో 50% నుంచి 10% తగ్గింది. మళ్లీ ఈ ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీ విలువలు, విశ్వసనీయతతో ముందుకు సాగాలని, ప్రజల విశ్వాసాన్ని తిరిగి గెలుచుకోవాలని జగన్ పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని, ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని టీడీపీ(TDP) నుంచి ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి(Ys rajashekar Reddy) ఆకాంక్షలకు అనుగుణంగా నడిపించాలని, 15 ఏళ్లుగా పార్టీ ప్రజలతో అనుబంధం కొనసాగిస్తోందని అన్నారు. పార్టీ ప్రక్షాళన ప్రక్రియలో భాగంగా గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు వ్యవస్థీకృత నిర్మాణంపై జగన్ దృష్టి పెట్టారు.

ehatv

ehatv

Next Story