వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిపై తప్పుడు రాతలు రాసిన మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిపై తప్పుడు రాతలు రాసిన మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. అమెరికాలో అదానీ గ్రూప్‌ వ్యవహారంలో నిజానిజాలతో పని లేకుండా తనపై ఇష్టం వచ్చిన రాతలు రాసిన సంస్థలపై వైఎస్‌ జగన్మోహన్రెడ్డి వంద కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. మీడియా సంస్థలు తమ క్లయింట్‌ పరువుకు బంగం కలిగించాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు జగన్‌ తరపు న్యాయవాదులు. అమెరికాలో దాఖలు చేసిన అభియోగ పత్రంలో జగన్‌ పేరు లేకపోయినా ఉన్నట్టుగా కట్టు కథలు రాశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు న్యాయవాదులు. వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల తర్వాత పిటిషనర్‌పై రాసే కథనాలకు పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.

Updated On
ehatv

ehatv

Next Story