టీడీపీ, ఎల్లో మీడియాతో యుద్ధం చేస్తున్నామని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు.

టీడీపీ, ఎల్లో మీడియాతో యుద్ధం చేస్తున్నామని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో లాండ్‌ ఆర్డర్‌ దిగజారిందని, పాలన వైఫల్యాలు, మోసాల మధ్య చంద్రబాబు పాలన కొనసాగుతోందన్నారు. టీడీపీ నేతలు, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు రెంటపాళ్ల వెళ్లానని.. బుధవారం కర్ఫ్యూలాంటి పరిస్థితుల మధ్య తన రెంటపాళ్ల పర్యటన విజయవంతమైందన్నారు. తమ పార్టీ శ్రేణుల్ని పరామర్శిస్తే తప్పా? మొన్నటి పొదిలి పర్యటనలో 40వేల మందిపై రాళ్లేసే ప్రయత్నం చేశారు. రైతులు సంయమనం పాటించారు. అయినా కేసులు పెట్టారు. రైతుల సమస్యల గురించి ఎవరూ మాట్లాడకూడదు. సంఘీభావం తెలపకూడదా? అని జగన్‌ ప్రశ్నించారు. చంద్రబాబు(Chandrababu) ఎందుకు భయపడుతున్నారు. ఓ టీవీ ఛానెల్‌లో చంద్రబాబు అహంకార మాటలు వినాలని... ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తారట. ప్రశ్నిస్తున్న వ్యక్తిని భూస్థాపితం చేస్తారా?. ఏడాది కాలంలోనే ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో చంద్రబాబు పాలనపై అసహనం పెరిగిందని.. ఆ అసహనాన్ని డైవర్ట్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై, నేతలపై కేసులు పెడుతున్నారు. టాపిక్‌ డైవర్ట్‌ చేస్తున్నారన్నారు.

డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా వైఎస్సార్‌సీపీ(Ysrcp) శ్రేణులు, నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని మద్యం కేసులో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని జగన్‌ (Ys Jagan)అన్నారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు. చెవిరెడ్డి అరెస్ట్‌ నిజంగా అశ్చర్యకరం. ‌తప్పుడు స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని గన్‌మెన్‌ను బలవంతం చేశారు. తప్పుడు స్టేట్‌మెంట్‌ ఇవ్వనందుకు గన్‌మెన్‌పై దాడి కూడా చేశారు. తనపై జరిగిన దాడిని గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రపతి, గవర్నర్‌, డీజీపీకి గన్‌మెన్‌ లేఖ రాశారని... మరో గన్‌మెన్‌ను ప్రలోభాలకు గురిచేసి వారికి అనుకూలంగా స్టేట్‌మెంట్‌ ఇప్పించుకున్నారని జగన్‌ ఆరోపించారు..

సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావు ఏం పాపం చేశారని జగన్‌ ప్రశ్నించారు. ఏం చేశారని కొమ్మినేనిని అరెస్ట్‌ చేశారు?టీవీ డిబెట్‌లో అనలిస్ట్‌ మాటలకు కొమ్మినేనికి ఏం సంబంధమన్నారు. గతంలో కేఎస్‌ఆర్‌ ఉద్యోగాన్ని చంద్రబాబు ఊడగొట్టించారు. కేఎస్‌ఆర్‌ అరెస్ట్‌ అక్రమమేనన్న సుప్రీంకోర్టు.. తనకున్న విచక్షణాధికారాల్ని ఉపయోగించి ఆయన్ను వెంటనే విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలించింది. సుప్రీం కోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టులాంటిదని జగన్‌ అన్నారు.

ehatv

ehatv

Next Story