ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys jagan), జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్థాన్ కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys jagan), జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్థాన్ కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రేపు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు వెళ్లనున్నారు. మురళీ నాయక్(Murali Nayak), ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)సందర్భంగా లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద శత్రువులతో పోరాడుతూ 25 ఏళ్ల వయసులో అమరుడయ్యారు. జగన్ ఇప్పటికే మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాం నాయక్, జ్యోతిబాయితో ఫోన్‌లో మాట్లాడి సంతాపం తెలిపారు, వారిని ధైర్యంగా ఉండాలని కోరారు.మురళీ నాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సాయం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల ఇంటి స్థలం, మురళీ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది. అలాగే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)వ్యక్తిగతంగా రూ.25 లక్షల సాయం అందించారు. జిల్లా కేంద్రంలో మురళీ నాయక్ స్మారక చిహ్నం, కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నారు.ఈ సందర్భంగా జగన్ (Ys Jagan)వ్యక్తిగతంగా కల్లి తండాలో కుటుంబ సభ్యులను కలిసి సానుభూతి తెలియజేయనున్నారు. వైసీపీ కార్యకర్తలు, నేతలు ఆయనకు స్వాగతం తెలపనున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story