YS Sharmila : కాంగ్రెస్ నాయకురాలు వై.ఎస్.షర్మిల తెలుగుదేశం పార్టీ అధినేత
చంద్రబాబు నాయుడు(Chandrababu) ఇంటికెళ్లారు. తన కుమారుడు రాజారెడ్డి(Raja Reddy), ప్రియా(Priya) అట్లూరి నిశ్చితార్థానికి(Engagement), వివాహవేడుకకు రావాలని చంద్రబాబును ఆహ్వానించారు.

YS Sharmila
పంపింది కేకు మాత్రమే!... చంద్రబాబును సాధారణంగా చూడాలి
చంద్రబాబు నాయుడు(Chandrababu) ఇంటికెళ్లారు. తన కుమారుడు రాజారెడ్డి(Raja Reddy), ప్రియా(Priya) అట్లూరి నిశ్చితార్థానికి(Engagement), వివాహవేడుకకు రావాలని చంద్రబాబును ఆహ్వానించారు. నిశ్చితార్థం ఈ నెల18న, పెళ్లి వచ్చే నెల 17న జరగనున్నాయి. చంద్రబాబు ఇంటికి వెళ్లింది పెళ్లికి ఆహ్వానించడానికే అయినప్పటికీ ఈ భేటి చర్చనీయాంశంగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(Jagan Mohan), మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మధ్య రాజకీయ విరోధం ఉంది. ఒకరికొకరికి అసలు పడదు. షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ నాయకురాలు.
త్వరలోనే ఏపీ కాంగ్రెస్(Congress) అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అప్పుడు అన్న జగన్‌పై విమర్శలు కురిపించాల్సి వస్తుంది. శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు ఇప్పుడు చంద్రబాబుతో షర్మిల స్నేహపూర్వకంగా ఉంటారేమో! పైగా మొన్నామధ్యనే షర్మిల వెనుక చంద్రబాబు ఉన్నారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి(Ramakrishna) ఆరోపించారు కూడా! పైగా క్రిస్మస్ పండుగ సందర్భంగా నారా లోకేశ్‌కు షర్మిల ప్రత్యేకంగా కానుకలను కూడా పంపారు. ప్రతిగా లోకేశ్ ట్వీట్ చేస్తూ షర్మిలకు కృతజ్ఞలు చెప్పడం, నారా కుటుంబం(Family) తరపున షర్మిలకు క్రిస్మస్, న్యూ ఇయర్ విషెస్ చెప్పడం మనం చూశాం.
అన్నింటికంటే ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం..షర్మిల పసుపుపచ్చ చీర(Yellow Saree) కట్టుకుని చంద్రబాబు ఇంటికి వెళ్లడం. చంద్రబాబు ఇంటికి షర్మిల వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకోవడం వెనుక ఈ పరిణామాలన్నీ ఉన్నాయి. అయితే చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత షర్మిల మీడియాతో ముచ్చటించారు. చంద్రబాబుతో అరగంట పాటు జరిపిన భేటి సారాంశాన్ని మూడు ముక్కల్లో చెప్పారు. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆ జ్ఞాపకాలను తనతో పంచుకున్నారని షర్మిల అన్నారు.
చంద్రబాబేను సాధారణంగానే చూడాలని చెబుతూ, రాజకీయాలు తమ ప్రొఫెషన్ అని, జీవితాలు కాదని చెప్పారు. ఒకరినొకరు ఎన్నో మాటలు అనుకుంటామని, రాజకీయంగా చంద్రబాబుకు తమకు లావాదేవీలు ఉండవని స్పష్టం చేశారు. క్రిస్మస్(Christmas) పండుగ సమయాన లోకేశ్‌కు(Nara Lokesh) పంపించింది కేవలం కేక్ మాత్రమేనని, కానుకలు కాదని తెలిపారు. తాను లోకేశ్ ఒక్కరికే కేకును పంపలేదని, కేటీఆర్, కవిత, హరీశ్‌లకు కూడా పండుగ విషెష్ చెబుతూ కేక్‌లను పంపానని తెలిపారు. దీన్ని రాజకీయంగా చూడకూడదని షర్మిల చెప్పుకొచ్చారు. మొత్తం మీద చంద్రబాబుతో జరిగిన భేటిలో ఎలాంటి రాజకీయఅంశాలు లేవని చెబుతూ స్పెక్యులేషన్స్‌కు పుల్‌స్టాప్ పెట్టారు షర్మిల.
