కొంతమంది సైకోలు(Psycho), సైకో పార్టీలతో కలసి ఉచ్ఛం నీచం లేకుండా సోషల్‌ మీడియాను(social media) భ్రష్టు పట్టించారు.

కొంతమంది సైకోలు(Psycho), సైకో పార్టీలతో కలసి ఉచ్ఛం నీచం లేకుండా సోషల్‌ మీడియాను(social media) భ్రష్టు పట్టించారు. మానవ, రక్త సంబంధాలు మరిచి మృగాలుగా మారారు. అలాంటి సోషల్‌ సైకోల బాధితుల్లో నేనూ ఒకరిని’ అని పీసీసీ(APCC) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల(YS Sharmila) అన్నారు. గురువారం ఆమె ఎక్స్‌ వేదికగా స్పందించారు. సైకో వర్రా రవీంద్రారెడ్డి(Varra Ravindra reddy) అరెస్టును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ‘సోషల్‌ మీడియాలో సైకోలు... ఇంట్లో తల్లి, అక్క, చెల్లి కూడా సాటి మహిళే అనే ఇంగితం లేకుండా, రాష్ట్రంలో ప్రశ్నించే మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టి, వికృత చేష్టలతో రాక్షసానందం పొందారు. ప్రతిష్ఠ దెబ్బతినేలా పోస్టులు పెట్టి, పైశాచికానందం పొందే సైకోలపై కఠినంగా చర్యలు ఉండాలి. నా మీద, మా అమ్మ మీద, సునీత మీద విచ్చలవిడిగా పోస్టులు పెట్టారు. నేను, వైఎస్‌ రాజశేఖర రెడ్డికి పుట్టలేదని అవమానించారు. నా ఇంటి పేరు మార్చి శునకానందం పొందారు. నాపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రారెడ్డిపై నేను కూడా కేసు పెట్టాను. అరాచక పోస్టులు పెట్టేవాళ్లు ఏ పార్టీలో ఉన్నా అంతు చూడాల్సిందే. మరోసారి సోషల్‌ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడాలంటే భయపడేలా అనునిత్యం చర్యలు కొనసాగాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నా’ అని షర్మిల పేర్కొన్నారు

Updated On
Eha Tv

Eha Tv

Next Story