కడప ఎస్పీని కలిసిన వైఎస్‌ సునీత

నిన్న ఆంధ్రప్రదేశ్‌ హోమ్‌ మంత్రి అనితను(vangalapudi anitha) కలిసిన వైఎస్‌ వివేకానందరెడ్డి(YS Vivekananda reddy) కూతురు వైఎస్‌ సునీత(YS sunitha) ఇవాళ కడప ఎస్పీ(Kadapa SP) హర్షవర్ధన్‌ రాజును(Harsha vardhan raju) కలిశారు. తన తండ్రి హత్య కేసు గురించి ఆయనతో చర్చించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో తమకు న్యాయం జరగలేదని సునీత ఆయనకు చెప్పారు. సీబీఐకి, తమకు పోలీసులు సహకరించలేదని ఆరోపించారు. నిందితులకు స్థానిక పోలీసులు అండగా నిలిచారని హర్షవర్ధన్‌రాజుతో చెప్పుకున్నారు సునీత. వివేకా కేసులో తప్పు చేసిన పోలీసులపై తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. విచారణ సమయంలో స్థానిక పోలీసులు కేసును నీరుగార్చేలా వ్యవహరించారని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు దృష్టికి తీసుకెళ్లారు సునీత.

Updated On
Eha Tv

Eha Tv

Next Story