ఆంధ్రప్రదేశ్‌ హోమ్‌మంత్రి అనితను(TDP Vangalapudi anitha) వై.ఎస్.వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy)కూతురు సునీత(YS Sunitha) కలిశారు.

ఆంధ్రప్రదేశ్‌ హోమ్‌మంత్రి అనితను(TDP Vangalapudi anitha) వై.ఎస్.వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy)కూతురు సునీత(YS Sunitha) కలిశారు. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయాన్ని ఆమెకు వివరించారు. వివేకానందరెడ్డి హత్య తరువాత జరిగిన పరిణామాలను మంత్రి అనిత దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో స్థానిక పోలీసులు నిందితులకు అండగా నిలిచారని సునీత ఆరోపించారు. ఆ పోలీసులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ(CBI) పరిధిలో ఉన్నందున ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని సునీతకు మంత్రి అనిత హామీ ఇచ్చారు. నేరం చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదనన్నారు మంత్రి.

తన తండ్రి వివేకానందరెడ్డిని కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డి హత్య చేయించారన్నది సునీత ఆరోపణ. అవినాశ్‌ను జగన్‌ కాపాడుతున్నారంటూ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు సునీత. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌ పార్టీ ఓడిపోవడానికి వివేకా హత్య కేసు కూడా ఓ కారణమని వైరి వర్గాలు అంటున్నాయి. మొత్తంమీద హోంమంత్రిని సునీత కలవడం చర్చనీయాంశంగా మారింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story