దివ్వెల మాధురి(Divvela Madhuri) ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయారు.

దివ్వెల మాధురి(Divvela Madhuri) ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YCP) ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌(MLC Duvvada srinivas) సన్నిహితురాలైన మాధురి వరుస మీడియా కథనాలతో తెలుగువారికి సుపరిచితురాలయ్యారు. ఆమె ఎక్కడికి వెళ్లినా సెల్ఫీల కోసం వెంటపడుతున్నారట! దువ్వాడ శ్రీనివాస్‌, మాధురి కలిసి వెళుతుంటే ఫోటోల కోసం రిక్వెస్ట్ చేస్తున్నారట! ఈ విషయాన్ని దువ్వాడే చెప్పుకొచ్చారు. మాధురిని చాలా మంది పొగుడుతున్నారట! ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారట! మహిళలు నీ అంత స్ట్రాంగ్‌గా ఉండాలని చెబుతున్నారట! హత్యకు గురైన వై.ఎస్‌.వివేకానంద రెడ్డి(Vivekananda Reddy,) రెండో భార్య షేక్‌ షమీ(Shiek shami) కూడా అయితే మాధురికి ఫోన్‌ చేసి చాలా సేపు మాట్లాడారట! మాధురి ధైర్యాన్ని ఆమె కొనియాడరట! 'నీ అంత ధైర్యం ఉంటే నా జీవితం చాలా బాగుండేది. నేను, నా బాబు ఒంటరిగా మిగిలిపోయాం. నిన్ను కలవాలని అనిపిస్తోంది. నీతో మాట్లాడాలని అనిపిస్తోంది. నిన్ను పర్సనల్‌గా కలుస్తాను' అని అన్నారని మాధురి చెబుతున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story