మంగళవారం మంగళప్రదంగా కేంద్రప్రభుత్వం ఆర్ధిక బడ్జెట్‌ను(State Financial budget) ప్రవేశపెట్టింది.

మంగళవారం మంగళప్రదంగా కేంద్రప్రభుత్వం ఆర్ధిక బడ్జెట్‌ను(State Financial budget) ప్రవేశపెట్టింది. బీహార్‌(Bihar), ఆంధ్రప్రదేశ్‌ను(Andhra Pradesh) సంతృప్తిపరచడానికి నరేంద్రమోదీ(Narendramodi) ప్రభుత్వం బడ్జెట్‌ను చక్కగా ఉపయోగించుకున్నదన్నది చాలా మంది విమర్శ! నిజానికి పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నప్పుడు, ఆర్ధిక మంత్రి నిర్మిలా సీతారామన్‌ ప్రసంగిస్తున్నప్పుడు ఏపీకి నిధులు బాగానే వచ్చాయని అనుకున్నారంతా. చివరకు వచ్చేసరికి అప్పుల హామీ తప్ప ఏమీ లేదని తేలిపోయింది. ఇటు తెలంగాణకు కూడా శూన్య హస్తమే మిగిలింది. ఎన్టీయే కూటమిలో ఉన్న పార్టీలకు తప్ప ఎవరూ బడ్జెట్‌ గొప్పగా ఉందని అనలేదు. విపక్ష నాయకులు అయితే దుమ్మెత్తి పోస్తున్నారు. చిత్రమేమిటంటే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) సైలెంట్‌గా ఉండిపోవడం. ఏ రాజకీయనాయకుడైనా బడ్జెట్‌పై రియాక్టవుతారు. మంచో చెడో చెబుతారు. బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR) కూడా ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెడుగుడు ఆడారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇదే చేస్తారు. జగన్‌ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బాగుందని చెప్పలేదు. బాగోలేదని అనలేదు. అప్పు అయినా ఫర్వాలేదని చంద్రబాబు అన్న తర్వాత అయినా జగన్‌ రియాక్టవ్వాల్సింది. అది కూడా జరగలేదు. ఇలాగైతే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ జనాల్లోకి ఎలా వెళుతుందని ఆ పార్టీ క్యాడరే అంటోంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story