YSRCP MLA Counter: “హైదరాబాద్ ఆటగాడు”, “పిఠాపురం పాటగాడు” అనలేమా: హోంమంత్రికి వైసీపీ ఎమ్మెల్యే చురకలు..!

“హైదరాబాద్ ఆటగాడు”, “పిఠాపురం పాటగాడు” అనలేమా అంటూ హోంమంత్రికి వైసీపీ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ చురకలు అంటించారు. వైఎస్‌ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ '' బెంగుళూరు అంకుల్” అంటూ హోంమంత్రి అనిత గారు చేసిన జూగుప్సకరమైన రాతలు చూస్తే కూటమి ప్రభుత్వంకు ఉన్న రాజకీయ భావ దారిద్ర్యం ఏంటో తెలుస్తుంది. సైద్ధాంతిక వాద ప్రతివాదాలు, విధాన నిర్దేశాలను కాకుండా వికృత రాజకీయ పర్యాలోచనల చేయడం ద్వారా మీ స్థాయి దిగజారుతుందని హోంమంత్రి అనిత గారు అర్ధం చేసుకుంటే మంచిది. దళిత మహిళకు హోం మంత్రి ఇవ్వాలనే వైయస్ జగన్ గారి రాజకీయ విధానం మార్చలేక తప్పక చంద్రబాబు గారు మీకు పదవిచ్చరని మీరు తెలుసుకుంటే మంచిది. “హైదరాబాద్ ఆటగాడు”, “పిఠాపురం పాటగాడు” అంటూ మేము వాఖ్యలు చేయచ్చు కానీ మీ స్థాయిలో మేము దిగజారలేం, మాకు రాజకీయ దార్శనికత ఉందే కానీ మీలాగ భావ దారిద్ర్యం లేదు. ఇప్పటికే “వర్క్ ఫ్రమ్ హోం” శాఖగా మీకిచ్చిన శాఖను పాతాళంలో పాతి పెట్టారు, ఇకనైనా దిగజారక దళిత ఆత్మగౌరవం దెబ్బతీయక, సుసంగతమైన, గుణప్రదమైన రాజకీయ అలవాట్లు మీకు వంటబట్టాలని దేవుడ్ని కోరుకుంటున్నా.. మీ అజ్ఞానానికి, అహంకారానికి, అవగాహన లేమికి హోమియోపతిలో ఏమైనా చికిత్స దొరకాలని ఆశిస్తున్నా'' అంటూ ఆయన సోషల్‌ మీడియా వేదిక అయిన ఎక్స్‌లో పోస్టు చేశారు.

Updated On
ehatv

ehatv

Next Story