YSRCP MLC : టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ..!
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు సీ రామచంద్రయ్య బుధవారం అధికార వైఎస్సార్‌సీపీని వీడి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.

YSRCP MLC Ramachandraiah quits party, joins TDP
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు సీ రామచంద్రయ్య(C Ramachandraiah) బుధవారం అధికార వైఎస్సార్‌సీపీ(YSRCP)ని వీడి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) సమక్షంలో టీడీపీ(TDP)లో చేరారు. మొన్న దాడి వీరభద్రరావు(Veerabhadrarao), ద్వారకానాథ్‌రెడ్డి(Dwarakanath Reddy) పార్టీని వీడగా.. నిన్న రామచంద్రయ్య కూడా వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరారు. అనంతపురం(Ananthapuram), బాపట్ల(Bapatla), చీరాల(Chirala), పార్వతీపురం(Parvathipuram)కు చెందిన పలువురు పలువురు సీనియర్ వైఎస్‌ఆర్‌సిపి సీనియర్ నేతలు కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలచే ఎమ్మెల్సీగా ఎన్నికైన రామచంద్రయ్యకు 2021లో ప్రారంభమైన 2027 వరకు శాసనమండలి సభ్యత్వం ఉంది. పార్టీలో చేరిన రామచంద్రయ్యకు చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు.
