ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu Naidu), మంత్రి నారా లోకేశ్‌లపై(Nara lokesh) వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ(YSRCP MP) సెటైర్లు వేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu Naidu), మంత్రి నారా లోకేశ్‌లపై(Nara lokesh) వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ(YSRCP MP) సెటైర్లు వేశారు. ఇతరుల సంతోషాన్ని చూసి వీరిద్దరు ఓర్వలేక ఏడుస్తుంటారని విమర్శించారు. ఎక్స్‌ వేదికగా విజయసాయిరెడ్డి వీరిద్దరి గురించి వ్యంగ్యోక్తులు రాశారు.

'నారద ముని ఒక రోజు శ్రీకృష్ణుడిని అడిగాడు.. 'ప్రభూ! చంద్రబాబు, అయన సుపుత్రుడు లోకేష్ ఎల్లప్పుడు దుఃఖంలో ఎందుకుంటున్నారు?' శ్రీకృష్ణుడు అద్భుత రీతిలో జవాబు ఇస్తూ, 'ప్రతి మనిషికి ఆనందాలు ఉంటాయి. కానీ, చంద్రబాబు మరియు లోకేష్ లాంటి వారు ఇతరుల సంతోషాన్ని చూసి ఓర్వలేక దుఃఖిస్తుంటారు! ' అని విజయసాయిరెడ్డి(Vijay sai reddy) ట్వీట్‌ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే దోపిడీ, మోసం, దగా అంటూ విజయసాయి రెడ్డి ఘాటుగా విమర్శించారు. సంపద సృష్టి లేదు, 40 ఏళ్ల అనుభవం లేదు., వంకాయ లేదు. అంతా దోపిడీనే అని విజయసాయిరెడ్డి విమర్శించారు. మళ్లీ 3 వేల కోట్ల అప్పు చేశారని, ఈ డబ్బంతా ఎక్కడికి పోతుందని ఆయన ప్రశ్నించారు. కార్పొరేషన్‌కు గ్యారంటీ ఇచ్చి తెచ్చిన అప్పుతో కలిసి ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు తెచ్చిన అప్పు దాదాపు 50 వేల కోట్ల రూపాయలకు పై మాటే అని విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి జీతాలు చెల్లించి ఖజానాలో ఉన్న డబ్బు దాదాపు ఏడు వేల కోట్లు అని.. అది కాకుండా కేంద్రం నుంచి వివిధ పద్దుల కింద వచ్చిన డబ్బు కూడా ఉందని విజయసాయిరెడ్డి అన్నారు. అయినప్పటికీ పిల్లలు తినే గోరుముద్దతో సహా జగన్‌ 38 సంక్షేమ పథకాల్లో ఏ ఒక్కటీ చంద్రబాబు కొనసాగించలేదని, పాత బిల్లులు చెల్లించడం లేదని పేర్కొన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story