పదవి పోగొట్టుకున్న దువ్వాడ

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌(MLC duvvada Srinivas) ఎపిసోడ్‌కు ఇంటర్వెల్ కార్డు పడినట్టుగా ఉంది. నాలుగైదు రోజుల పాటు రాష్ట్రంలో మరే వార్త లేనట్టుగా దువ్వాడ మీద పడిన మీడియా ఆయన ఫ్యామిలీ మ్యాటర్‌లలో దూరడం మానేసింది. మీడియా వదిలి పెట్టేసింది కానీ కష్టాలు ఆయనను వదలడం లేదు. టెక్కలి సెగ్మెంట్‌లో వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న దువ్వాడను అధిష్టానం తొలగించింది. ఆ పదవిలో పేరాడ తిలక్‌ను(Perada thilak) నియమించింది. ఇకపై నియోజకవర్గ సమన్వయ బాధ్యత తిలక్‌దేనని చెప్పింది. కొన్నిరోజులుగా కుటుంబ వివాదంతో చిక్కుకున్న దువ్వాడ శ్రీనివాస్‌ వ్యవహారంతో పార్టీకి నష్టం జరుగుతుందన్న భావనతోనే జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఉంది.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్‌ టెక్కలి నుంచి అచ్చెన్నాయుడిపై పోటీచేసి ఓడిపోయారు. అయితే అప్పటికే ఆయనకు ఎమ్మెల్సీ హోదా ఉండడంతో అది మాత్రం ప్రస్తుతం కొనసాగుతోంది. . పార్టీ పరంగా మాత్రం నియోజకవర్గాన్ని సమన్వయ పరిచే కీలక బాధ్యతల నుంచి తప్పించారు జగన్‌(YS jagan).

Updated On
Eha Tv

Eha Tv

Next Story