Kanumuri Ravichandra Reddy : టీడీపీ ప్యాకేజీతోనే జనసేన పార్టీ నడుస్తోంది
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆ పార్టీ అధిష్టానం ఈ నెల 20న విజయనగరం జిల్లాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది.

YSRCP State Official Spokesperson Kanumuri Ravi Chandra Reddy Press Meet
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) యువగళం పాదయాత్ర(Yuvagalam Padayatra) ముగింపు సందర్భంగా ఆ పార్టీ అధిష్టానం ఈ నెల 20న విజయనగరం(Vijayanagaram) జిల్లాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హాజరవుతున్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి. కానీ ఆ తర్వాత పవన్ రావడం లేదనే చర్చ జరిగింది. టీడీపీ మొదట ట్వీట్ చేసిన పోస్టర్‌లో చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, లోకేష్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అయితే యువగళం ముగింపు సభకు పవన్ కూడా వస్తున్నారని మరోసారి తెలిపింది టీడీపీ. 'రండి... చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములవ్వండి! ఒకే వేదికపై తిరుగులేని ప్రజా నాయకుల అపూర్వ సంగమం. విశాఖలో యువగళం - నవశకం కార్యక్రమ వేదికపై తెలుగుదేశం, జనసేన అధినేతలు' అంటూ టీడీపీ కేడర్ చెప్పింది.
ఈ పరిణామాలపై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి(Kanumuri Ravichandra Reddy) స్పందించారు. అవి ప్యాకేజీ చర్చలని, ప్యాకేజీపై దత్తపుత్రుడు అలకబూనితే.. బాబు రాయబారం కోసం వెళ్లారంటూ విమర్శలు గుప్పించారు. పుత్రుడు-దత్తపుత్రుడు మధ్య ఆధిపత్య పోరును బాబు సెటిల్‌మెంట్ చేశారని అన్నారు. ప్రజల మేలు, వారి ప్రయోజనాల కోసం పనిచేస్తోన్న ప్రభుత్వం గురించి నాలుగు మంచి మాటలు రాయడానికి ఎల్లోమీడియాకు మనసు రాదుగానీ.. తెలంగాణ రాష్ట్రంలో పవన్‌కళ్యాణ్(Pawan Kalyan) ఇంటికి చంద్రబాబు వెళ్లినప్పుడు.. చంద్రబాబు(Chandrababu) ఇంటికి పవన్‌కళ్యాణ్ వెళ్లినప్పుడు ఆ ఎల్లో మీడియా(Yellow Media) చేస్తున్న హడావిడి అంతాఇంతా కాదన్నారు.
చంద్రబాబుకు పవన్‌కళ్యాణ్‌కు మధ్య సంబంధాలన్నీ ప్యాకేజీతో ముడిపడినవేననేది జగమెరిగిన సత్యం అన్నారు. వారు ఇద్దరూ కలిసినప్పుడల్లా చర్చ పవన్‌కళ్యాణ్‌కు టీడీపీ నుంచి ఎంత ప్యాకేజీ అందించాలనే అంశంపైనే అనేది వాస్తవమన్నారు. నూటికి నూరుపాళ్లూ పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అనడంలో తప్పేమీలేదన్నారు కనుమూరి రవిచంద్రారెడ్డి. టీడీపీ నుంచి వరుసగా వస్తున్న ప్యాకేజీతోనే జనసేన పార్టీ నడుస్తోందనే విషయం అందరికీ తెలుసన్నారు. ఇటీవల చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ దత్తపుత్రునికి సరిపోవడంలేదనే విషయంపై కొంత చర్చ జరిగింది. అందుకే చంద్రబాబు కొడుకు లోకేశ్ తలపెట్టిన యువగళం ముగింపు సభకు మొదట పవన్‌కళ్యాణ్ హాజరుకావడంలేదన్నాడు. దీంతో నేరుగా చంద్రబాబు రాయబారానికి వెళ్లాడని.. హైదరాబాద్‌లో పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లి మాట్లాడి బుజ్జగించినట్లు మాకు సమాచారం ఉందన్నారు. వారిరువురి మధ్య దాదాపు రెండు గంటల పాటు జరిగిన చర్చ అంతా కూడా ప్యాకేజీ పొత్తుపైనే అని అన్నారు.
