ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ(YCP) ఆధ్వర్యంలో "వెన్నుపోటు దినం"(Vennupotu Dinam)గా ప్రకటించి

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ(YCP) ఆధ్వర్యంలో "వెన్నుపోటు దినం"(Vennupotu Dinam)గా ప్రకటించి, తెలుగుదేశం పార్టీ (TDP)నేతృత్వంలోని ఎన్డీఏ (NDA)ప్రభుత్వం 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై నిరసనలు చేపట్టింది. ఈ నిరసనలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, ముఖ్యంగా "సూపర్ సిక్స్" (Super Six)హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ నిర్వహించారు. ఇచ్చిన ఎన్నికల హామీలు, ముఖ్యంగా "సూపర్ సిక్స్"లో భాగంగా ఉచిత బస్సు సేవలు(Free Bus), రైతు భరోసా(Rythu Bharosa), అమ్మ ఒడి(Ammavadi), ఉచిత విద్యుత్(Free Current) వంటివి అమలు కాలేదని ఆరోపిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం నిరసనలు చేపట్టింది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం, రైతులకు తగిన మద్దతు ఇవ్వకపోవడం, విద్యా వ్యవస్థలో అవకతవకలు వంటి వాటిని ఎత్తి చూపారు. రాష్ట్రవ్యాప్తంగా నెల్లూరు(Nellore), చిత్తూరు(Chithoor), కృష్ణా(Krishna), తిరుపతి(Tirupati), విశాఖపట్నం(Vizag), కాకినాడ(Kakinada), కర్నూలు వంటి ప్రాంతాల్లో YSRCP నాయకులు, కార్యకర్తలు ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు.

Updated On
ehatv

ehatv

Next Story