వివాదాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామి(Astrologer Venu Swamy)వారం రోజులుగా వార్తల్లో నలుగుతున్నారు.

వివాదాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామి(Astrologer Venu Swamy)వారం రోజులుగా వార్తల్లో నలుగుతున్నారు. అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya), ధూళిపాళ్ల శోభిత(sobitha)ఎంగేజ్‌మెంట్‌ సందర్భంగా వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. చాలా మంది వేణుస్వామిని తప్పుపట్టారు. తర్వాత వేణుస్వామి వివరణ ఇచ్చుకున్నారనుకోండి.. తాజాగా ఆయన సమంత(Samantha)కు సారీ చెప్పారు. 'నాతో నీ జాతకం చెప్పించిన వ్యక్తులు, సంస్థల తరఫున నీకు క్షమాపణలు చెబుతున్నాను. నీ పట్ల జాలి లేకుండా రాక్షస భావజాలంతో ప్రవర్తించిన తెలుగు సమాజం తరఫున నన్ను క్షమించమని కోరుతున్నాను. నీకు జరిగిన నష్టాన్ని ఎవ్వరూ పూడ్చలేరు, నీకు ధైర్యం చెప్పడం తప్ప నేనేం చేయలేను' అంటూ వేణుస్వామి చెప్పుకొచ్చారు. నాగచైతన్య-శోభిత ఎంగేజ్‌మెంట్‌ తర్వాత సమంతపై సింపతీ పెరగకూడదనే ఉద్దేశంతో తనను తెరపైకి తెచ్చారన్నది వేణుస్వామి వాదన! ఇందులో కుట్ర లేకపోలేదని ఆయన భావన! 'సమంతకు సింపతీ వస్తుందని, జనాలకు సమంతపై జాలి కలుగుతుందని, టోటల్ గా సబ్జెక్ట్ ను డైవర్ట్ చేయడానికి చేసిన కుట్రలో భాగంగా నన్ను తెరపైకి తీసుకొచ్చారు. సినిమా ప్రముఖుల జాతకాల్ని వేణుస్వామి అడగకుండా చెప్పుతున్నాడని ఆరోపిస్తూ, సమంతను పూర్తిగా చర్చలో లేకుండా పక్కకు పంపించారు. ఒక స్త్రీకి జరిగిన నష్టంపై చర్చ జరగకుండా ఉండేందుకు తెలివిగా నన్ను తెరపైకి తెచ్చారు' అని వేణుస్వామి చెప్పుకొచ్చారు. తాను తెలుగువాడిని కాబట్టి జాతకం చెబితే టార్గెట్ చేశారని, ఇదే ఏ తమిళవాడో, కన్నడవాడో జాతకం చెబితే అతడి కాళ్లు కడిగి, నెత్తిన పెట్టుకొని ఊరేగిస్తారని వేణుస్వామి అన్నారు.

Updated On
ehatv

ehatv

Next Story