ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ప్రెడిక్టర్స్‌(Predictors) ఉండే వారు.. కొందరు చెప్పినవి కొన్ని నిజం అవుతాయి కూడా.. కానీ ఓ ప్రఖ్యాత ఆస్ట్రాలజిస్ట్‌ పేరు విన్నారా..? ఫ్రాన్స్‌(France) దేశానికి చెందిన 'నోస్ట్రాడామస్‌'(Nostradamus)... ఈ పేరు వినగానే భవిష్యత్‌ గురించి కచ్చితంగా చెప్పే ఓ ఆస్ట్రాలజిస్ట్‌(Astrologer) గుర్తొస్తారు.

ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ప్రెడిక్టర్స్‌(Predictors) ఉండే వారు.. కొందరు చెప్పినవి కొన్ని నిజం అవుతాయి కూడా.. కానీ ఓ ప్రఖ్యాత ఆస్ట్రాలజిస్ట్‌ పేరు విన్నారా..? ఫ్రాన్స్‌(France) దేశానికి చెందిన 'నోస్ట్రాడామస్‌'(Nostradamus)... ఈ పేరు వినగానే భవిష్యత్‌ గురించి కచ్చితంగా చెప్పే ఓ ఆస్ట్రాలజిస్ట్‌(Astrologer) గుర్తొస్తారు. 2024 గురించి 500 ఏళ్ల క్రితమే ప్రఖ్యాత ఆస్ట్రాలజిస్ట్ నోస్ట్రా డామస్ ఏం చెప్పారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. నోస్ట్రా డామస్‌ పుస్తకంపై ప్రపంచంలో ఎప్పుడూ చర్చ నడుస్తూ ఉంటుంది. భవిష్యత్‌ గురించి తన పుస్తకంలో ఎన్నో విషయాలు నోస్ట్రా డామస్‌ పొందుపరిచారు.

ప్రపంచంలో ఏ సంవత్సరం ఏం జరుగుతుందో వందల ఏళ్లకు ముందే ఊహించి రాయడం మామూలు విషయం కాదు. నోస్ట్రాడామస్‌ చెప్పిన ఎన్నో విషయాలు జరిగాయి.. జరుగుతున్నాయి కూడా.. జరగబోతాయన్న భయం కూడా ఉంది. ఈ క్రమంలో 2024లో ఏం జరుగుతోందన్న ఆసక్తి ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. ఇలాంటి చర్చలు 2000, 2020లో కూడా జరిగాయి. 2024లో జలవాయు పరివర్తనం చాలా తీవ్రంగా ఉంటుందట. నీటిలో, వాయువులో మార్పు చాలా తీవ్రంగా ఉంటుందట. వడగాడ్పులు(Heat waves) చాలా తీవ్రంగా ఉంటాయని నోస్ట్రాడామస్‌ హెచ్చరించారు. భూమి(Earth) కూడా గతంతో పోలిస్తే చాలా వేడిగా మారనుందట.

2024లో అణుదాడులు జరిగే అవకాశం కూడా ఉందట. ఈ అణుదాడులు జలవాయులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయట. అమెరికా(America), చైనా(china) మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉందని నోస్ట్రాడామస్‌ హెచ్చరించారు. సముద్రాల్లో భయోత్పాతం సంభవిస్తుందని పుస్తకంలో రాశారు. 2024పై నోస్ట్రాడామస్‌ అంచనాలు ప్రపంచాన్ని ఆందోళన కలిగిస్తున్నాయి.2024లో అమెరికా ఎన్నికల్లో అస్థిరత ఏర్పడుతుందట. అమెరికాలో అంతర్యుద్ధం కూడా జరిగే అవకాశముందని నోస్ట్రాడామస్‌ అంచనా వేశారు. జర్మనీలో హిట్లర్‌ జన్మించడం, అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హత్య గురించి చెప్పారు. దాదాపు 100 మంది భవిష్యత్‌ను పుస్తకంలో రాశారు. తన కవితల ద్వారా భవిష్యత్‌ గురించి నోస్ట్రాడామ్‌ చెప్పారు. ఆ కవితలను ఇప్పుడు డీకోడ్‌ చేసి, ఆ కవితలను భవిష్యవాణిగా చూస్తున్నారు. ఏది ఏమైనా 2024లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనని పరిశోధకులు, ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Updated On 7 Nov 2023 6:07 AM GMT
Ehatv

Ehatv

Next Story