మనలో చాలా మంది నిద్రపోయే ముందు అన్ని లైట్లను ఆర్పేసి నిద్రపోతారు. అంటే చీకట్లో నిద్రపోవడం అలవాటు. అయితే శుక్రవారం రాత్రి మాత్రం ఇలా చేయకూడదు.

మనలో చాలా మంది నిద్రపోయే ముందు అన్ని లైట్లను ఆర్పేసి నిద్రపోతారు. అంటే చీకట్లో నిద్రపోవడం అలవాటు. అయితే శుక్రవారం రాత్రి మాత్రం ఇలా చేయకూడదు. శుక్రవారం నాడు ఈశాన్య(Northeast) దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి. లేదా ఈ దిశలో లైట్లను ఆర్పకుండా వెలిగించే ఉంచండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీ దేవి(laxmidevi) వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది. ఫలితంగా ఆమె తన వెంట ఇంట్లో సంపద తీసుకొస్తుందని విశ్వసిస్తారు

లక్ష్మీదేవిని సంతృప్తి పరచాలంటే శుక్రవారం(Friday) రాత్రి పడనుకునే ముందు లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా చిత్రంలో మల్లేపూల సుగంధం లేదా మల్లేపూలను సమర్పించడం ద్వారా తల్లి అనుగ్రహం పొందవచ్చు. ఫలితంగా డబ్బుకు మీ ఇంట్లో కొరతే ఉండదు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే లక్ష్మీ దేవి గులాబీ సుగంధాన్ని లేదా గులాబీ పూలను సమర్పించాలి. ఫలితంగా వారి దాంపత్యం జీవితంలో సుఖంగా ఉంటారు.

మీరు ఆర్థిక కొరత ఏర్పడుతుంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి కర్పూరంతో హారతి ఇచ్చిన తర్వాత అందులో ఉండే బూడిదను ఎరుపు రంగులో కాగితంలో ఉంచుకొని మీ పర్సులో ఉంచండి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక ప్రవాహమ పెరుగుతుంది. అంతేకాకుండా మీరు ప్రతిపనిలోనూ విజయం సాధిస్తారు. దీంతో పాటు రాగి నాణెం తీసుకొని లక్ష్మీదేవిని ధ్యానించండి. అనంతరం వీటని మీ పర్సులో ఉంచుకోండి.

ehatv

ehatv

Next Story