అన్ని రంగాల వారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది.

స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం

గ్రీష్మ ఋతౌః / ఆషాఢమాసం / శుక్లపక్షం

తిథి : పాడ్యమి మ 01.24 వరకు ఉపరి విదియ

వారం : గురువారం (గురువాసరే)

నక్షత్రం : ఆరుద్ర ఉ 08.46 వరకు ఉపరి పునర్వసు

సూర్యోదయాస్తమాలు:

ఉ05.37/సా06.44విజయవాడ

ఉ05.44/సా06.54హైదరాబాద్

సూర్యరాశి : మిధునం చంద్రరాశి : మిధునం/కర్కాటకం

యోగం : ధ్రువ ప 11.40 వరకు ఉపరి వ్యాఘాత

కరణం : బవ మ 01.24 బాలువ రా 12.17 ఉపరి కౌలువ

సాధారణ శుభ సమయాలు:

ఉ 11.00 - 01.00 సా 04.00 - 06.00

అమృత కాలం : (27) తె 05.06 - 06.36 వరకు

అభిజిత్ కాలం : ప 11.44 - 12.37

వర్జ్యం : రా 08.04 - 09.34

దుర్ముహూర్తం : ఉ 09.59 - 10.52 మ 03.14 - 04.06

రాహు కాలం : మ 01.49 - 03.27

గుళికకాళం : ఉ 08.54 - 10.32

యమగండం : ఉ 05.37 - 07.15

ప్రయాణశూల : దక్షిణ దిక్కుకు పనికిరాదు

వైదిక విషయాలు:

ప్రాతః కాలం : ఉ 05.37 - 08.14

సంగవ కాలం : 08.14 - 10.51

మధ్యాహ్న కాలం : 10.51 - 01.29

అపరాహ్న కాలం : మ 01.29 - 04.06

ఆబ్ధికం తిధి : ఆషాఢ శుద్ధ పాడ్యమి/విదియ

సాయంకాలం :సా 04.06 - 06.44

ప్రదోష కాలం : సా 06.44 - 08.54

రాత్రి కాలం : రా 08.54 - 11.49

నిశీధి కాలం : రా 11.49 - 12.32

బ్రాహ్మీ ముహూర్తం : తె 04.10 - 04.54

మేషం

అన్ని రంగాల వారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఆదాయం సరిపడినంత ఉండదు. వృధా ఖర్చులు పెరుగుతాయి దూర ప్రయాణాలు ఇబ్బందికరంగా సాగుతాయి. బంధు మిత్రులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

వృషభం

ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఋణాలు తీర్చగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన పదవులు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యములకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారములలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

మిధునం

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. బంధు మిత్రుల నుండి కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగులకు అందివచ్చిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో ప్రశంసలు పొందుతారు. వ్యాపారాలు నూతన ప్రణాళికలు అమలు చేస్తారు.

కర్కాటకం

దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. దూరపు బంధువుల నుండి ఊహించని వార్తలు వినవలసి వస్తుంది. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకున్న చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

సింహం

దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. కుటుంబ సభ్యుల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఋణ సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు.

కన్య

ఆప్తుల నుండి అందిన అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది. ప్రముఖుల పరిచయాల వలన అనుకున్న పనులు వేగంగా పూర్తిచేస్తారు. పాత బాకీలు తీర్చగలుగుతారు వ్యాపార విస్తరణలో ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి.

తుల

సోదరులు నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం

ఇంటా బయట ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి. ప్రయాణాలు అంతగా కలసిరావు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. బంధు మిత్రుల తో మనస్పర్ధలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. వృత్తి, వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురిఅవుతారు.

ధనస్సు

ముఖ్యమైన వ్యవహారాలలో సమయానుకూలంగా నిర్ణయాలు అమలు చెయ్యలేరు. ఆర్థిక వ్యవహారాలలో ఆశించినరీతిగా ఉండవు. కుటుంబ వాతావరణం చికాకులు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారులతో అలోచించి మాట్లాడటం మంచిది.

మకరం

బంధు మిత్రులని కలుసుకుని గృహమున ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలని నిర్వహిస్తారు. ఇంటా బయట మీ ప్రవర్తనతో అందరిని ఆకట్టుకుంటారు. సంఘంలో ప్రముఖుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోభివృద్ధి కలుగుతుంది.

కుంభం

సోదరుల నుండి ధనపరంగా ఊహించని చిక్కులు కలుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వ్యర్ధంగా మిగులుతాయి. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మీనం

వృత్తి ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి. దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. నూతనవస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్ధిరాస్తి సంభందిత వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి.

ehatv

ehatv

Next Story