గ్రహగతులను బట్టి రాశులు ఏర్పడతాయి.

గ్రహగతులను బట్టి రాశులు ఏర్పడతాయి. రాశుల ఆధారంగా జ్యోతిష్యం(Astrology) చెబుతారు. కొన్ని గ్రహాల(Planets) కలయిక కొన్ని రాశులవారికి మేలు చేస్తాయి. కొన్ని రాశులవారికి కీడు తలపెడతాయి. అంటే ఒకే రాశిలో ఒకటి కంటే రెండు గ్రహాల కలయిక ప్రత్యేక యోగాలను కలిగిస్తాయి. మూడు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు త్రిగ్రాహి యోగం ఏర్పుడుతుంది. ఈ నెల 16వ తేదీ శుక్రవారం రోజున ఒకే రాశిలో బుధుడు, శుక్రుడుతో పాటు సూర్యుడు కూడా వస్తున్నాడు. ఈ మూడు గ్రహాల కలయికకు వేదికగా సూర్యుడు అధిపతి అయిన సింహరాశి కానుంది. దీంతో జ్యోతిష్యశాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న త్రిగ్రాహి యోగం(Trigrahi yogam) ఏర్పడనుంది. కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తున్నది. ఆర్థిక సమస్యలు(Financial help) తీరబోతున్నాయి. ధనస్సు రాశి వారికి త్రిగ్రాహి యోగం లాభాన్ని కలిగించనుంది. వీరికి ఊహించని విధంగా ఆదాయం లభిస్తుంది. కొత్త ఆదాయ వనరులు చేకూరుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు కాలం కలిసి వస్తుంది. పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఇక సింహరాశివారు(simha rasi) అనుకున్న పనులు అనుకున్నట్టుగానే పూర్తి చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుముఖం పడతాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. అపజయం అన్నదే ఉండదు. వృశ్చిక రాశికి చెందిన వ్యక్తులకు ఈ త్రిగ్రాహి యోగం మంచి ఫలితాలను కలిగిస్తుంది. ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి. . ఖర్చులు తగ్గించుకోవాలి. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు తీరతాయి. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story