2026 ఆంగ్ల సంవత్సరానికి, శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించినటువంటి ఆ ధనుస్సు రాశి ఫలితాలను తెలుసుకుందాం.

2026 ఆంగ్ల సంవత్సరానికి, శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించినటువంటి ఆ ధనుస్సు రాశి ఫలితాలను తెలుసుకుందాం. ధనుస్సు రాశిని ఇంగ్లీష్‌లో సజిటేరియస్ అంటారు. మూల ఒకటి, రెండు, మూడు, నాలుగు పాదములు, పూర్వాషాడ ఒకటి, రెండు, మూడు, నాలుగు పాదములు, ఉత్తరాషాడ ఒకటవ పాదము. ఈ సంవత్సరం ఆదాయం-14 వ్యయం-11 రాజపూజ్యం-5, అవమానం-6. ఈ సంవత్సరము అర్ధాష్టమ శని నడుస్తా ఉంది. ధనుస్సు రాశికి గురుబలం చాలా అనుకూలంగా ఉంది. అది ఒక్కటే కనిపిస్తా ఉంది, మీకు ఉన్నటువంటి పలుకుబడి, ధైర్య సాహసాలు, ముందుచూపు, ముందుకు వెళ్లేతనం వల్ల మీరు సమస్యల నుండి బయట పడతారు. తెలివిగా పనులు చక్కబెడతారు. ఈ సంవత్సరము మీ తెలివి మీద మీ జీవితం ఆధారపడి ఉంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, మీరు తీసుకునేటువంటి పెట్టుబడులు, జనరల్‌గా అర్ధాష్టమ శనిలో డబ్బు ఎక్కువగా వస్తుంది. వివిధ రకాలుగా డబ్బు చేతికి అందుతుంది, నానా విధాలుగా డబ్బు చేతికి అందుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, కానీ మూర్ఖపు నిర్ణయాల వల్ల, అతి తెలివి నిర్ణయాల వల్ల, ఇగోఇష్టిక్ నిర్ణయాల వల్ల సమస్యలు ఎక్కువగా వస్తాయి. అంటే ఉదాహరణ పక్కవాడు ఏదో చేస్తున్నాడు, మనం చేయాలి అనేటువంటి ఆలోచనలు, లేదా ఇగోకు పోయి తీసుకునే నిర్ణయాలు, మిమ్మల్ని బాధిస్తాయి. అంటే జనరల్ గా డబ్బు లేక సమస్యలు చాలా మందికి ఉంటే, మీకు డబ్బు ఎక్కువగా ఉండడం వల్ల సమస్యలు, అర్ధాష్టమ శనిలో వచ్చేటువంటి సమస్యలు ఇవే కాబట్టి, కొత్తగా పెట్టే వ్యాపారాల వల్ల, అలాగే ఇన్వెస్ట్మెంట్ల వల్ల మీరు ధన నష్టం కొని తెచ్చుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది, మరీ ముఖ్యంగా వ్యసనాల జోలికి వెళ్ళకుండా ఉంటే, విద్యార్థులకు చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశీ వీసాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు గోచరిస్తా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రం అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ, సిఐడి, ఏసిబి, సిబిఐ లాంటి కేసులు బాధించే అవకాశం ఉంది.

బ్యూరోక్రాట్‌లు పై లెవల్ ఐఏఎస్, ఐపిఎస్ లాంటి వాళ్ళకి, ఇక వ్యాపారస్తులకు ట్యాక్స్ గొడవ ఉండేటువంటి అవకాశం ఉంది. సేల్స్, కమర్షియల్ టాక్స్, ఇన్కమ్ టాక్స్ , ఈడీల వల్ల సమస్యలు ఉంటాయి. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం ఈడి సమస్యలు ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. బట్ డబ్బు విపరీతంగా చేతికి అందుతుంది. అలాగే స్త్రీలకు విశేషంగా అనుకూలంగా ఉండబోతా ఉంది. కుటుంబంలో మీ మాట చెల్లుబాట అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. వ్యాపారస్తులకు అనుకూలంగా చూసుకున్నాము, అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే క్రీడాకారులకు, కళాకారులకు అవకాశాలు, ఆదాయం రెండు పెరుగుతాయి. అవార్డులు, రివార్డులు కూడా వస్తాయి. క్రీడాకారులు అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ తీసుకునేటువంటి కేటగిరీలో రైతులు వస్తారు. రైతులు ఆల్మోస్ట్‌, పౌల్ట్రీ గాని లేదా చేపలు, రొయ్యలు అలాగే రెండు పంటల వరిపండించేటువంటి రైతులు వీళ్ళందరికీ అనుకూలంగా కనిపిస్తా ఉంది. రెండు పంటల దిగుబడి రాబడి హెచ్చుగా ఉంటుంది. రుణాలు తీరుస్తారు, శుభకార్యాలు నిర్వహిస్తారు, రాజకీయ రంగంలో ఉండే వారికి డబ్బు ఎక్కువ ఖర్చుఅయినప్పటికీ, కూడా విజయం మిమ్మల్ని వరిస్తుంది. ప్రభుత్వ పదవి గాని లేదా పార్టీ పదవి గాని మిమ్మల్ని వరించే అవకాశం ఉంది. ఓవరాల్‌గా ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ అర్ధాష్టమ శని వల్ల కొద్ది సమస్యలు కనిపిస్తా ఉన్నాయి. తిరునల్లా శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి పూర్తిగా బయట పడతారు. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది.

Updated On
ehatv

ehatv

Next Story