Venu Swamy : కర్కాటకరాశి-2026 ఫలితాలు..! సున్నా నుంచి 100వ ఫ్లోర్ వరకు..! వేణుస్వామి జ్యోతిష్యం..!
2026 ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి, శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించి కర్కాటక రాశి ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

2026 ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి, శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించి కర్కాటక రాశి ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పునర్వసు నాలుగవ పాదము, పుష్యమి ఒకటి, రెండు, మూడు, నాలుగు పాదములు, ఆశ్లేష ఒకటి, రెండు, మూడు, నాలుగు పాదములు కర్కాటక రాశి కిందికి వస్తాయి. కర్కాటక రాశిని ఇంగ్లీష్లో క్యాన్సర్ అంటారు. ఆదాయం-2, వ్యయం-11 రాజపూజ్యం-4, అవమానం-7. ఈ సంవత్సరము మీకు శని అనుకూలంగా ఉన్నాడు ఇది నెంబర్ వన్, నెంబర్ టూ. ఒక గొప్ప విషయం ఏమిటంటే గురువు అతిచారంలోకి వెళ్తా ఉన్నాడు. సో మిధునం, కర్కాటకం, సింహం, మూడు రాశులను గురువు కమాండ్ చేయబోతా ఉన్నాడు. ఈ సంవత్సరము అతి ముఖ్యమైనటువంటి విషయము గురువు అతిచారము. ఎలా ఉంటుంది అంటే ఒకేసారి గ్రౌండ్ ఫ్లోర్ నుండి 100వ ఫ్లోర్ లోకి ప్రయాణం చేసినట్లుగా ఉంటుంది లైఫ్. చాలా చాలా చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది. చాలా మంది పరిచయం అవుతారు. కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. మీరు నానా విధాలుగా డబ్బు సంపాదించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది.
ఏ రంగంలోని వారికైనా విశేషమైన ఫలితాలు ఉండబోతా ఉన్నాయి. సమా సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఘటిస్తారు. సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవ స్థితికి చేరుకుంటారు. ప్రతి ఒక్కరు మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశం ఉంది. సంఘంలో కుటుంబంలో మీకు మంచి పేరు వస్తుంది. బంధువర్గంలో మిమ్మల్ని చాలామంది గుర్తిస్తారు. అలాగే స్నేహితులు మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. ముఖ్యంగా శత్రువులను ఈ సంవత్సరం లైట్ గా తీసుకోండి, మీ జోలికి వచ్చినటువంటి శత్రువులు ఎవరు కూడా, మీ జోలికి వచ్చి నిలబడలేరు. లైఫ్ లో మీ జోలికి వచ్చినటువంటి శత్రువుల జీవితం నాశనం అయ్యేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తా ఉంది. కాబట్టి లైట్ తీసుకోండి. అవివాహితులకు వివాహ సూచనలు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, జీవితంలో స్థిరం ఏర్పడుతుంది. వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం ఉంటుంది. విదేశీ వీసాల కోసం వెళ్ళే వారికి వీసాలు వస్తాయి. ఆ గురుబలం వల్ల అన్ని రంగాల వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు చాలా చాలా చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. పదవులు లభిస్తాయి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి, ఏదైనా పదవులు వరిస్తాయి, అలాగే ఎన్నికలల్లో గెలుపు సాధిస్తారు, కానీ ఒక విషయం ఏమిటంటే మీకు ఎన్ని రూపాయలు వచ్చినా అంటే 10 రూపాయలు సంపాదిస్తే, 15 రూపాయల ఖర్చు ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, ఎక్కడి నుండైనా సరే అంటే ఖర్చు అనేటువంటిది అధికము. ఈ సంవత్సరం లగ్జరీస్ కు చాలా ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు భూములు గాని, గృహాలు గాని నిర్మించడము, భూములు కొనుగోలు చేయడము అనేటువంటిది జరిగేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. కర్కాటక రావి వారికి 2026 ఎలా ఉండబోతుంది. 'వేణుస్వామి' జ్యోతిష్యంలో


