Kumbha Rasi : కుంభరాశివారూ.. ఈ ఏడాది అస్సలు బాగోలేదు.. ఈ పూజలు చేస్తే కొద్దిగా ఫలితం: వేణుస్వామి
2026వ సంవత్సరము శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించి కుంభరాశి ఇంగ్లీష్‌లో అక్వేరియస్.

2026వ సంవత్సరము శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించి కుంభరాశి ఇంగ్లీష్‌లో అక్వేరియస్. ధనిష్ట మూడు, నాలుగు శతబిషం-1, నాలుగు పూర్వభాద్ర 1. ఆదాయం-2, వ్యయం-8. రాజపూజ్యం-4, అవమానం-2. ఈ సంవత్సరం కుంభ రాశి వారికి ఎలా ఉండబోతా ఉంది అంటే, ఏలినాటి శని చివరి అంకలో, మూడవ అంకలో ఉంది. శని రాహువు, కేతువు, గురువు నలుగురు కూడా చెడు ఫలితాలను ఇస్తా ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి, 100కి 95% నెగిటివ్ ఫలితాలు మీకు ఉండబోతా ఉన్నాయి. స్త్రీలకు మరీ ముఖ్యంగా మానసికమైన ఇబ్బందులు, గర్భ సంచికి సంబంధించిన సమస్యలు, థైరాయిడ్ సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో చాలా వరకు సమస్యలు ఉంటాయి. సంతానం వల్ల ఇబ్బందులు ఉంటాయి. భార్యాభర్తలు మధ్యన గొడవలు ఉంటాయి. స్త్రీలకు, అలాగే విద్యార్థులకు, చెడు సహవాసాల వల్ల సమస్యలు, అలాగే మార్కులు తక్కువగా రావడం అనేటువంటిది, ఈ సంవత్సరం ముఖ్యమైన విషయం. వీసాలు రిజెక్ట్ అవుతాయి, జనవరి ఫస్ట్ నుండి జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు గోచరిస్తా ఉన్నాయి. నలుపురంగు వాహనాలకు దూరంగా ఉండండి. అలాగే అగ్ని ప్రమాదాలు, ఇంట్లో చోరభయం కనిపిస్తా ఉంది. విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు.
విద్యార్థులు గాని, ఉద్యోగస్తులు గాని, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, కాంట్రాక్టర్లకు ట్యాక్స్ పరమైన ఇబ్బందులు. ఈడి వల్ల సమస్యలు, ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ సమస్యలు, ఈ సంవత్సరం కనిపిస్తా ఉన్నాయి. వ్యాపారస్తులకు చాలా సమస్యలు ఉంటాయి. ట్యాక్స్ పరంగా జాగ్రత్తగా ఉండండి, ప్రభుత్వంతో జాగ్రత్తగా మెలగండి, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు, బ్యూరోక్రాట్స్ ,పెద్ద పొజిషన్లో ఉండేవారు, ఏసీబీ, సీబీఐ, సీఐడీ లాంటి కేసుల పాలవుతారు. రాజకీయ నాయకులకు చాలా సమస్యలు ఉంటాయి. ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది, పార్టీలో చెడ్డ పేరు వస్తుంది, డబ్బు చాలా ఖర్చు అయినప్పటికీ ఓడిపోతారు. ఏ రంగంలో వారు తీసుకున్నా ఏలినాడు శని వెళ్ళిపోతుంది కాబట్టి, 2026 లో వెళ్ళిపోయే ముందు 27 లో వెళ్ళిపోతుంది, 27 అనుకూలంగా ఉంటుంది, కానీ 26 లో సమస్యలు ఉంటాయి కాబట్టి, ఇది చివరి దశ అంటారు. ఎలినాటి శని జాగ్రత్తగా ఉండండి, మరీ ముఖ్యంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు, తల్లిదండ్రుల్లో ఒకరికి ప్రాణ హాని, అలాగే వాహన ప్రమాదాలు, ఇంట్లో అగ్ని ప్రమాదాలు, చోర భయము అంటే దొంగలు పడడము, విలువైన వస్తువులు కోల్పోవడము ఇవన్నీ కూడా ఈ సంవత్సరము కుంభ రాశి వారికి కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి నలుపురంగు దుస్తులకు దూరంగా ఉండండి. మరీ ముఖ్యంగా నలుపురంగు కార్లకు దూరంగా ఉండండి, ఆనలు నలుపురంగు వస్తువులు, లెదర్ వస్తువులకు దూరంగా ఉండండి. అలాగే ఈ రాశివారు శనివార నియమాన్ని పాటించండి. అంటే శనివారం నాడు ఉపవాస దీక్ష చేయాలి, ఉపవాస దీక్ష అంటే, శనివారం నాడు ఉదయం భోజనము చేయడము, రాత్రి టిఫిన్ చేయడము, అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. సాధ్యమైనంత వరకు తిరునల్ల శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకుంటే కుంభ రాశి వారు సమస్యల నుండి బయటపడి, మంచి ఫలితాలను పొందే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ


